తమిళ డైరక్టరే ముద్దు.. తెలుగు డైరక్టర్ వద్దు!

By AN TeluguFirst Published Nov 30, 2019, 12:44 PM IST
Highlights

అందుతున్న సమాచారం మేరకు తెలుగు దర్శకులను ప్రక్కన పెట్టి తమిళ డైరక్టర్స్ తో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. దర్శకుడు దేవకట్టా కథ చెప్పి ఒప్పించినా, ముందుగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో సినిమా చేద్దామనే నిర్ణయానికి వచ్చాడట.

మన తెలుగు హీరోల్లో  చాలా మందికి తమిళ దర్శకులతో చేయాలనే కోరిక ఉంటుంది. తమిళ డైరక్టర్ తో సినిమా చేస్తే తమిళ మార్కెట్ లో కూడా అడుగు పెట్టచ్చు అనే ఆలోచన ఒకటి అయితే, తమిళ దర్శకులు చాలా డిఫరెంట్ గా ఉంటారనే ఆలోచన కూడా వారితో చేయాలనుకోవటానికి  ఒక కారణం కావచ్చు. అందుకేనేమో ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి తేజ్ కూడా ఆ దారిలో ప్రయాణం పెట్టుకున్నట్లు సమాచారం.

 సాయి ధరమ్ తేజ్ .. కు కెరీర్ ప్రారంభంలో మంచి హిట్లు వచ్చినప్పటికీ ఆ తర్వాత చాలా సినిమాలు ప్లాప్ అవుతూ వచ్చాయి. ఏకంగా వరసగా ఆరు  ప్లాపులు దాకా రావడంతో సాయికి హిట్టు తప్పానిసరి అయిపొయింది.  ఆ టైమ్ లో కిషోర్ తిరుమలతో చేసిన చిత్రలహరి మంచి సక్సెస్  అందించింది. దాంతో  చేయబోయే సినిమా దర్శకుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు సాయి .

బిగ్ బాస్ కంటెస్టంట్ పై లైంగిక వేధింపులు!

ఈ క్రమంలో మారుతీ దర్శకత్వంలో ప్రతిరోజూ పండగే అనే సినిమాని మొదలు పెట్టాడు. పక్కా ఫ్యామిలీ కథగా ఈ సినిమా తెరకెక్కి రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో సాయికి జోడిగా మేహరీన్ నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన సినిమా సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ సినిమా తర్వాత ఏ ప్రాజెక్టు చేయాలనేది సాయి ఆలోచన . అందుకోసం పలువులు దర్శకులతో మీటింగ్స్ జరుపుతున్నారు.

అందుతున్న సమాచారం మేరకు తెలుగు దర్శకులను ప్రక్కన పెట్టి తమిళ డైరక్టర్స్ తో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. దర్శకుడు దేవకట్టా కథ చెప్పి ఒప్పించినా, ముందుగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో సినిమా చేద్దామనే నిర్ణయానికి వచ్చాడట. ఈ మేరకు ఆయన ఓ స్టోరీ లైన్ చెప్పటం, దానికి సాయి తేజ్ ఓకే చెప్పటం జరిగిందట. అనీల్ సుంకర ఈ చిత్రం నిర్మించే అవకాసం ఉందిట.  దర్శకుడు, నిర్మాత రీసెంట్ గా చెన్నై లో కలుసుకుని డిస్కషన్స్ జరిపారట.

అదే ఓ తెలుగు దర్శకుడు కథ చెప్పే వంద వంకలు చెప్పి, వెర్షన్స్ రాయించే హీరోలు తమిళ దర్శకుడుతో సినిమా అనగానే ఎక్కడలేని ఉత్సాహం ప్రదర్శిస్తూంటారు. అందుకేనేమో ఆ తమిళ దర్శకులు తమ మాతృభాషలో హిట్ కొట్టి తెలుగుకు వచ్చేసరికి ఏదో ఒకటి తీసేద్దాం అనే ధోరణి ప్రదర్శిస్తూంటారు అంటున్నారు ఫిల్మ్ నగర్ జనం.

 

click me!