బిగ్ బాస్ కంటెస్టంట్ పై లైంగిక వేధింపులు!

Published : Nov 30, 2019, 10:43 AM IST
బిగ్ బాస్ కంటెస్టంట్ పై లైంగిక వేధింపులు!

సారాంశం

తాజా మాజీ బిగ్ బాస్ కంటెస్టంట్ పై ఓ యువకుడు లైంగిక చర్యకి పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గురువారం తెల్లవారు జామున కేరళలో చోటు చేసుకుంది.  బాధితురాలు అళువ నగరంలో బస్సు ఎక్కి ట్రావెల్ చేస్తుండగా.. ఆమె పైబెర్త్ లో ఉన్న యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడట.

సమాజంలో ఆడవాళ్లకు భద్రత లేకుండా పోతుంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఆడవాళ్లపై మానవ మృగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ అఘాయిత్యాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. సామాన్య అమ్మయిలతో పాటు సెలబ్రిటీలను కూడా విడిచిపెట్టడం లేదు.

తాజా మాజీ బిగ్ బాస్ కంటెస్టంట్ పై ఓ యువకుడు లైంగిక చర్యకి పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గురువారం తెల్లవారు జామున కేరళలో చోటు చేసుకుంది. బాధితురాలు అళువ నగరంలో బస్సు ఎక్కి ట్రావెల్ చేస్తుండగా.. ఆమె పైబెర్త్ లో ఉన్న యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడట.

నేను, నా ఫ్యామిలీ నీకు అడ్డు చెప్పము.. పెళ్లి కోసం ఆమె కండిషన్ కు ఒప్పుకున్న హీరో!

ఎక్కడపడితే అక్కడ చేతులు వేయడానికి ప్రయత్నించడంతో ఆమె బిగ్గరగా అరిచిందట. దీంతో డ్రైవర్ బస్సు ఆపేశాడట. నిందుతుడిని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లాలని ఆమె చెప్పడంతో.. ఆ వ్యక్తి తను ఏమీ చేయలేదనితప్పించుకునే ప్రయత్నం చేశాడట. ఆ తరువాత క్షమాపణలు చెప్పి పోలీసులకు మాత్రం పట్టించొద్దని వేడుకున్నాడట.

అయినప్పటికీ ఆమె మాత్రం తగ్గకుండా.. కొట్టక్కళ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని ప్రశ్నించగా.. తాను ఆ అమ్మాయిపై ఎలాంటి అఘాయిత్యం చేయలేదని.. బెర్త్ పక్కనున్న కర్టెన్స్ మూస్తుంటే ఆ అమ్మాయి తప్పుగా అర్ధం చేసుకుందని తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?