సాయి తేజ ‘ప్రతిరోజు పండగే’ ఫిల్మ్ నగర్ టాక్!

By AN TeluguFirst Published Dec 18, 2019, 11:08 AM IST
Highlights

అందుతున్న సమాచారం మేరకు ..ఈ సినిమా ట్రీట్మెంట్ బేస్ గా జరిగే కథ. సత్యరాజ్ పాత్ర కాన్సర్ అని మొదటే ఓపెన్ చేసేసి, ఫ్యామిలీ ఎమోషన్స్ పండించే ప్రయత్నం చేసారు.

వరస ఫ్లాఫ్ లతో దూసుకుపోయిన సాయి తేజ ... చిత్రలహరి మూవీతో ఓ డీసెంట్ హిట్ తన ఖాతాలో వేసుకుని కాస్త ఒడ్డున పడ్డాడు. ఇప్పుడు  ‘ప్రతిరోజు పండగే’  టైటిల్ తో మరో చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..గా రూపొందిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో.. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించాయి.  ‘ప్రతిరోజూ పండగే’ మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 20న  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫిల్మ్ నగర్ టాక్ బయిటకు వచ్చింది.

అందుతున్న సమాచారం మేరకు ..ఈ సినిమా ట్రీట్మెంట్ బేస్ గా జరిగే కథ. సత్యరాజ్ పాత్ర కాన్సర్ అని మొదటే ఓపెన్ చేసేసి, ఫ్యామిలీ ఎమోషన్స్ పండించే ప్రయత్నం చేసారు.
 లంగ్ క్యాన్సర్‌ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉండి, కేవలం అయిదు వారాలు మాత్రమే లైఫ్ స్పాన్ ఉన్న సత్యరాజ్ చివరి కోరికగా విదేశాల్లో ఉండే తన వారిని చూడాలనుకోవడం, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా.. మనవడు వచ్చి తాతని సంతోష పరచడం.. ఇది సినిమా స్టోరీ లైన్.

ప్రభాస్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోలు వైరల్!

 సాయి ధరమ్ తేజ ...తన వాళ్లందరినీ దగ్గర చేసే శతమానం భవతి తరహా పాత్ర. రాశి ఖన్నా పాత్ర ..టిక్ టాక్ ఏంజెల్ గా నవ్వించటమే సినిమాలో రిలీఫ్. ఫ్యామిలీ డ్రామా బాగానే పండింది. అయితే థియోటర్స్ కు మహారాజ పోషకులైన యూత్ కు ఎంతవరకూ పడుతుందనే విషయం చూడాలి. పల్లెటూరి నేపథ్యంలో మనుషుల మధ్య బంధాలు, సంబంధాలు.. కుటుంబ విలువలు చాటిచెప్తూ తెరకెక్కిన   విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి.

యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్నా ఫ్యామిలీ ఆడియన్స్ అండతో కలెక్షన్స్ లాగేస్తుందనిపిస్తుంది. ఫస్టాఫ్ పూర్తి ఫన్ తో నడిచిపోయినా, సెకండాఫ్ సీరియస్ ఎమోషన్ తో, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పూర్తిగా శాడ్ నోట్ తో  సాగిందింటున్నారు.సాంగ్స్ ఛల్తా. ఫ్యామిలీ ఆడియెన్ ని దృష్టిలో ఉంచుకుని తీసిన ఈ చిత్ర‌ం యూత్ కు కనెక్ట్ అయ్యే అంశాలు కాస్త తక్కువే ఉన్నాయి. అయితే  ప్ర‌స్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ అన్ సీజన్ నడుస్తోంది. ఏ సినిమాకు అయినా కలెక్షన్స్ అంతంత మాత్ర‌మే అన్నట్లుంది. ఇలాంటి గడ్డు టైమ్ లో వస్తున్న ఈ సినిమా.. ఓపెనింగ్స్, ఫస్ట్ వీకెండ్ బాగున్నా... లాంగ్ ర‌న్ లో ఆశించిన మైలేజ్ ఎంతవరకూ వస్తుందనేది చూడాల్సిన విషయం.  
 
 విజయకుమార్, రావు రమేష్, మురళీశర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్‌రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జైకుమార్ వసంత్, సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబు, సహనిర్మాత: ఎస్.కె.ఎన్, రచన-దర్శకత్వం: మారుతి దాసరి.

click me!