సాయి ధరమ్ తేజ్ గ్యారేజీలో నాలుగు బైక్ లు: ప్రమాదానికి గురైన స్పోర్ట్స్ బైక్ ప్రత్యేకతలివే..

By telugu teamFirst Published Sep 11, 2021, 10:30 AM IST
Highlights

ప్రమాదానికి గురైన సమయంలో హీరో సాయి ధరమ్ తేజ్ వాడిన స్పోర్ట్స్ బైక్ ట్రియాంఫ్ కంపెనీకి చెందింది. దీన్ని సాయి ధరమ్ తేజ్ ఇటీవలే కొనుగోలు చేశారు. ఈ బైక్ ను ఇటీవలే కంపెనీ అప్ గ్రేడ్ చేసింది.

హైదరాబాద్: సినీ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రయాణించిన బైక్ గురించి ఇప్పుడు చాలా మంది ఆరా తీస్తున్నారు. ఆయన వాడిన స్పోర్ట్స్ బైక్ ట్రియాంఫ్స్ మోటార్ సైకిల్. సాయి ధరమ్ తేజ్ తను ఇష్టపడి కొనుక్కున్న కారు అది. ఐదు నెలల క్రితమే దాన్ని కొనుగోలు చేశాడు. ఈ స్పోర్ట్స్ బైక్ షోరూంలు దేశవ్యాప్తంగా 16 మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ బైక్ ను సాయి ధరమ్ తేజ్ హైదరాబదులో లాంచ్ చేశాడు. 

సాయి ధరమ్ తేజ్ కు కార్ల కన్నా బైక్ ల మీదనే మక్కువ ఎక్కువ. ఆయనకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ బైక్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. మరోటి తల్లి ఇచ్చింది. సాయి ధరమ్ తేజ్ రెండు కొన్నాడు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన బైక్ తాను కొన్నదే. బైక్ మీద వీకెండ్ రైడింగ్ కు వెళ్లడం ఆయనకు సరదా. కోహినూర్ వెనక భాగంలో మిత్రులతో కలిసి బైక్ రైడింగ్ చేస్తుంటాడు. ఆయన స్పోర్ట్స్ వియర్ ధరించి మాత్రమే రైడింగ్ చేస్తుంటాడు. అయితే శుక్రవారం ఆయన ఫార్మల్ డ్రెస్ వేసుకుని ఉన్నాడు. దాంతో ఆయన ఓ కార్యక్రమానికి వెళ్తున్నట్లు భావిస్తున్నారు ఆయన ఎక్కడికి వెళ్లినా స్పోర్ట్స్ బైక్ లనే వాడుతారని మిత్రులు చెబుతున్నారు.

హెల్మెట్ ధరించడం వల్ల సాయి ధరమ్ తేజ్ కు పెద్ద ప్రమాదం తప్పింది. సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన తొలుత ఓ అమ్మాయి చూసి అంబులెన్స్ కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయనను వెంటనే మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అపోలోలోని ఐసీయులో చికిత్స పొందుతన్నారు. స్పోర్ట్స్ బైక్ ల మీద ఆయనకు పూర్తి అవగాహన ఉన్నట్లు అర్థమవుతోంది. దానివల్ల కూడా తీవ్రమైన గాయాలు ఏవీ కాకుండా ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. 

అతి వేగమే సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే, సాయి ధరమ్ తేజ్ వాడిన బైక్ ను సంస్థ ఇటీవలే అప్ గ్రేడ్ చేసింది. 11.60సీసీకి దాన్ని అప్ గ్రేడ్ చేసింది. బ్రేకింగ్, స్పీడ్ సామర్థ్యాలను పెంచుతూ దాన్ని అప్ గ్రేడ్ చేసింది. జాతీయ రహదారులను దృష్టిలో పెట్టుకుని ఈ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్ ను అప్ గ్రేడ్ చేశారు. దాని కనిష్ట వేగం 150 కిలోమీటర్లు ఉంటుందని చెబుతారు. అయితే, ప్రమాదానికి గురైనప్పుడు సాయి ధరమ్ తేజ్ బైక్ వేగం 120 కిలోమీటర్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఆ బైక్ దాదాపుగా సిటీ రోడ్లకు పనికి రాదని అంటారు. 

మామూలు బైక్ ల టైర్ల మాదిరిగా కాకుండా ఈ స్పోర్ట్ బైక్ టైర్లు ఫ్లాట్ గా ఉంటాయి. మామూలు బైక్ ల టైర్లు అరిగిపోయి గ్రిప్ పోతే జారిపోయి ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే, సాయి ధరమ్ తేజ్ వాడిన స్పోర్ట్స్ బైక్ టైర్లు ఫ్లాట్ గా ఉండడం వల్ల అలాంటి ప్రమాదాలు ఏవీ జరగవని అంటున్నారు. బ్రైక్ వేస్తే వెంటనే బైక్ ఆగిపోతుంది. లంగరు వేస్తే ఓడ ఆగిపోయినట్లుగా ఆగిపోతుందని చెబుతున్నారు.

అయితే, సాయి ధరమ్ తేజ్ బైక్ ను నియంత్రించడంలో తనకున్న అవగాహన వల్ల ఫలితం సాధించినప్పటికీ ఇసుక వల్ల బైక్ స్కిడ్ అయినట్లు భావిస్తున్నారు దాదాపు బైక్ అతన్ని రోడ్డు మీద 600 మీటర్ల వరకు లాక్కుని వెళ్లింది. అయినప్పటికీ బైక్ పెద్దగా డ్యామేజ్ కాలేదు. అతి అంత పటిష్టంగా ఉంటుందని చెబుతున్నారు.

సాయి ధరమ్ తేజ్ చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రికి శనివారం ఉదయం హీరో రామ్ చరణ్ తేజ్, ఆయన సతీమణి ఉపాసన వచ్చారు.  సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఐసీయులోనే ఉన్నారు. శ్వాస సంబంధమైన సమస్యలు రాకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాలర్ బోన్ కు చికిత్స చేస్తే ఆరు నుంచి 8 వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. 

click me!