దెబ్బపడినా ఆశ చావలేదు..  మరోసారి తెరపైకి సాహో?

By Prashanth MFirst Published Oct 22, 2019, 1:47 PM IST
Highlights

సాహో సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నిర్మాతలకు ఎంతవరకు నష్టం వాటిల్లిందో గాని  తెలుగు హక్కులను సొంతం చేసుకున్న బయ్యర్లు మాత్రం భారీగా నష్టపోయారు. కేవలం హిందీలో తప్ప సాహో సినిమా మరెక్కడా క్లిక్కవ్వలేదు. మలయాళం - తమిళ్ లో అయితే మరీ దారుణం. 

భారీ అంచనాల నడుమ విడుదలైన సాహో సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నిర్మాతలకు ఎంతవరకు నష్టం వాటిల్లిందో గాని తెలుగు హక్కులను సొంతం చేసుకున్న బయ్యర్లు మాత్రం భారీగా నష్టపోయారు. కేవలం హిందీలో తప్ప సాహో సినిమా మరెక్కడా క్లిక్కవ్వలేదు.

మలయాళం - తమిళ్ లో అయితే మరీ దారుణం.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. సాహో సినిమాను విదేశీ భాషల్లోకి అనువాదం చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వస్తోంది. నిర్మాతలు యూవీ క్రియేషన్స్ యువ దర్శకుడిపై నమ్మకం ఉంచి ఇన్నేళ్లు సంపాదించిందంతా ధారపోశారు. ప్రీ రిలీజ్ బజ్ గట్టిగా ఉండడంతో పెట్టిన బడ్జెట్ వెనక్కి వచ్చేసింది. సేఫ్ జోన్ లోకి వచ్చేశారు. కానీ అభిమానును మాత్రం తీవ్రంగా నీరాశపరిచారనే చెప్పాలి.

ఇప్పటికి సినిమా మేకింగ్ లో ఎలాంటి పొరపాటు జరగలేదని ఆడియెన్స్ అతిగా అంచనాలు పెట్టుకోవడం వల్ల సినిమాపై ఎఫెక్ట్ పడిందని డిస్కస్ చేసుకుంటున్నారట.  దర్శకుడు సుజిత్ అయితే సినిమా పర్ఫెక్ట్ గా వచ్చిందని ప్రతి విషయాన్నీ వలిచి చెప్పాలా అన్నట్లుగా గత ఇంటర్వ్యూలో ఆన్సర్ ఇచ్చాడు. అలాగే సినిమాను కూల్ గా రెండవసారి చూస్తే కూడా అర్థమవుతుందని చెప్పాడు.

also read: జాన్ కోసం ప్రభాస్ కి మరో ఛాలెంజ్.. తగ్గాల్సిందే!

కానీ సినిమాను సౌత్ ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు.  నార్త్ లో మాత్రం మాస్ ఆడియెన్స్ ని సినిమా ఎట్రాక్ట్ చేసింది. దీంతో అలాగే చైనా - జపాన్ వంటి దేశాల్లో సినిమాను రిలీజ్ చేస్తే సినిమా క్లిక్కయ్యే అవకాశం ఉందని యూవీ క్రియేషన్స్ ఆలోచించినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

click me!