డబ్బు లేక నన్ను హీరోగా పరిచయం చేశారు.. బాబీ సినిమాపై రిషీ కపూర్‌

By Satish ReddyFirst Published Apr 30, 2020, 1:34 PM IST
Highlights

మేరా నామ్ జోకర్ సినిమాతో బాలనటుడిగా పరిచయం అయిన రిషీ కపూర్‌ ఆ సినిమాతోనే జాతీయ అవార్డును అందుకున్నాడు. ఆ తరువాత 1973లో రిలీజ్ అయిన బాబీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఈ గ్లామరస్ స్టార్. అయితే ఈ సినిమాలో తనను హీరోగా సెలెక్ట్ చేయటం వెనుక ఓ ఆసక్తికర నేపథ్యం ఉందని తెలిపాడు రిషీ కపూర్.

లెజెండరీ నటుడు రిషీ కపూర్‌ గురువారం ఉదయం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన గతంలో చేసిన పలు వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. రిషీ కపూర్‌ లెజెండరీ స్టార్‌ హీరో, దర్శకుడు, నిర్మాత రాజ్‌ కపూర్‌ వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించినా.. హీరోగా పరిచయం కావటం మాత్రం అనుకోకుండానే జరిగిందట.

మేరా నామ్ జోకర్ సినిమాతో బాలనటుడిగా పరిచయం అయిన రిషీ కపూర్‌ ఆ సినిమాతోనే జాతీయ అవార్డును అందుకున్నాడు. ఆ తరువాత 1973లో రిలీజ్ అయిన బాబీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఈ గ్లామరస్ స్టార్. అయితే ఈ సినిమాలో తనను హీరోగా సెలెక్ట్ చేయటం వెనుక ఓ ఆసక్తికర నేపథ్యం ఉందని తెలిపాడు రిషీ కపూర్. రిషీ తండ్రి రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన బాబీ సినిమాలో డింపుల్ కపాడీయా హీరోయిన్‌గా నటించింది.


రాజ్‌ కపూర్‌ మేరా నామ్ జోకర్ సినిమా కోసం అప్పులు చేశారట. అయితే ఆ అప్పులు తీర్చేందుకు బాబీ సినిమాను ప్రారంభించాడు రాజ్ కపూర్. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కోసం ముందుగా రాజేష్ ఖన్నాను హీరోగా తీసుకోవాలని భావించారట. కానీ అప్పటికే అప్పుల్లో ఉండటంతో అంత బడ్జెట్‌ కేటాయించలేకే.. రిషీని హీరోగా పరిచయం చేశారట. అలా అనుకోకుండా తాను హీరో అయ్యానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు రిషీ కపూర్‌.

click me!