పవన్‌ జోలికి వస్తే చెప్పుతో కొడతాం: తమన్నా

Published : Apr 30, 2020, 12:27 PM IST
పవన్‌ జోలికి వస్తే చెప్పుతో కొడతాం: తమన్నా

సారాంశం

కొందరు తాము పాపులర్ కావటం కోసం పవన్‌ మీద విమర్శలు చేస్తున్నారని చెప్పింది తమన్నా సింహాద్రి. ముఖ్యంగా రాకేష్ మాస్టర్‌, శ్రీ రెడ్డి, కత్తి మహేష్ లాంటి వారు పాపులర్ కావడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఫైర్‌ అయ్యింది. పవన్‌ తిట్టి పాపులర్ కావాలనుకుంటున్న వాళ్లంత పిచ్చికుక్కలు అంటూ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడింది.

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్‌ కారణంగా సినిమాలు సీరియల్స్‌కు బ్రేక్ పడటంతో సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. తాజాగా ట్రాన్స్‌జెండర్‌, బిగ్ బాస్‌ కంటెస్టెంట్‌ తమన్నా సింహాద్రి ఓ మీడియా సంస్థకు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జనసేన పార్టీలో చేరిన ఆమె పవన్‌ కళ్యాణ్‌ వెంట తాము ఉన్నామని, ఆయన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తాట తీస్తానని ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది.

కొందరు తాము పాపులర్ కావటం కోసం పవన్‌ మీద విమర్శలు చేస్తున్నారని చెప్పింది. ముఖ్యంగా రాకేష్ మాస్టర్‌, శ్రీ రెడ్డి, కత్తి మహేష్ లాంటి వారు పాపులర్ కావడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఫైర్‌ అయ్యింది. పవన్‌ తిట్టి పాపులర్ కావాలనుకుంటున్న వాళ్లంత పిచ్చికుక్కలు అంటూ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడింది. అలాంటి వారికి పవన్‌ కళ్యాణ్‌ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, వాళ్లని చెప్పుతో కొట్టేందుకు మేం ఉన్నామని వార్నింగ్‌ ఇచ్చింది.

శ్రీ రెడ్డి మహిళ కాబట్టి వదిలేస్తున్నామని, ఈ కరోనా నుంచి బయట పడిన తరువా  పవన్‌ మీద నోరు పారేసుకునే వాళ్లను చెప్పుతో కొడతాం అని చెప్పింది తమన్నా. పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి పవన్ చాలా కష్టపడుతున్నాడని చెప్పింది. పవన్‌ ఓటమి, గెలుపులతో సంబంధం లేకుండా ప్రజల కోసం పోరాడుతున్నాడని చెప్పుకొచ్చింది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున టికెట్‌ ఆశించిన తమన్నాకు టికెట్ దక్కలేదు. దీంతో ఇండిపెండెంట్‌గా పోటి చేసి ఓడిపోయింది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?