ముంబై వీధుల్లో అపరిచితులకు నటి కౌగిలింతలు!

Published : Jan 23, 2020, 10:33 AM IST
ముంబై వీధుల్లో అపరిచితులకు నటి కౌగిలింతలు!

సారాంశం

నటి రిచా చద్దా ముంబై వీధిలో వెళ్తున్న అపరిచితులకు కౌగిలింతలు ఇచ్చారు. చేతిలో 'ఫ్రీ హగ్స్' అని రాసి ఉన్న ఫ్లకార్డ్ ని పట్టుకొని అందరినీ ఆప్యాయంగా పలకరించారు. 

మనం ఇష్టపడే వారిని ప్రేమగా హత్తుకుంటే చాలు.. ఉన్న ఒత్తిడంతా పోతుందంటారు. ప్రేమని పంచే కౌగిలింత కోసం ప్రత్యేకంగా ఓ రోజుని కేటాయించి జాతీయ కౌగిలింతల దినోత్సవం కూడా జరుపుతున్నారు.

జనవరి 21న ఈ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి రిచా చద్దా ముంబై వీధిలో వెళ్తున్న అపరిచితులకు కౌగిలింతలు ఇచ్చారు. చేతిలో 'ఫ్రీ హగ్స్' అని రాసి ఉన్న ఫ్లకార్డ్ ని పట్టుకొని అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను రిచా ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు.

హాల్ టికెట్ పై హీరోయిన్ ఫొటో.. షాకైన స్టూడెంట్

ప్రతి ఏడాది ఇలా చేయాలనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో ఎంతో ద్వేషం ఉందని.. అందుకే ప్రేమతో దాన్ని తగ్గించాలని అనుకున్నట్లు.. అపరిచితులను కౌగిలించుకోవడం ఓ మ్యాజిక్ లా అనిపించిందని చెప్పారు.

ప్రతి ఏడాది ఇలానే చేయాలనిపిస్తోందని అన్నారు. వచ్చే ఏడాది మీరు నన్ను కలవొచ్చు అంటూ అభిమానులకు చెప్పింది. సంతోషంగా ఉంటూ అందరికీ ప్రేమని పంచండి అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?