విపరీత పరిస్థితుల నుంచి పుట్టిన వ్యక్తే ‘కొండా’ మురళీ.. ఇంట్రెస్టింగ్ గా సెకండ్ ట్రైలర్.. రిలీజ్ డేట్ ఇదే..

Published : Jun 03, 2022, 05:10 PM IST
విపరీత పరిస్థితుల నుంచి పుట్టిన వ్యక్తే ‘కొండా’ మురళీ..  ఇంట్రెస్టింగ్ గా సెకండ్ ట్రైలర్.. రిలీజ్ డేట్ ఇదే..

సారాంశం

సినీయర్ పొలిటికల్ దంపతులు కొండా సురేఖ - మురళీ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం ‘కొండా’. ఈ మూవీ ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమైంది. తాజాగా మేకర్స్ సినిమా నుంచి రెండో ట్రైలర్ ను రిలీజ్ చేశారు.   

వివాదాస్పద బయోపిక్ మూవీస్ తీయ్యడంతో రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma )కు ఎవరూ సాటి రారు. ఎవరికి భయపడకుండా.. ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా తనకు అనకున్నది అనుకున్నట్టు తీస్తుంటాడు వర్మ.  ఈ క్రమలోనే వరంగల్ కు చెందిన సీనియర్ పొలిటికల్ దంపతులు కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా 'కొండా' (Konda)సినిమాను రూపొందించారు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్‌, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ (Irra Mor) నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో యాపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. కొండా సుష్మితా పటేల్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఉన్నా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేళలకు జూన్ 23న సినిమాను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు.  

ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్, మొదటి ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్, డైలాగ్స్, సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇంట్రెస్ట్  ను క్రియేట్ చేస్తున్నాయి. మరోవైపు పబ్లిక్ ఐకాన్ అయిన కొండా మురళీ, కొండా సురేఖ దంపుతల జీవిత చరిత్ర కావడంతో ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొని ఉంది. గతంలో సినిమా ప్రమోషన్స్ ను గట్టిగానే చేసినా సినిమాను మాత్రం విడుదల చేయలేదు. మళ్లీ తాజాగా సినిమాను రిలీజ్ బోతున్నామంటూ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ‘కొండా’ నుంచి రెండో ట్రైలర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్.

గతంలో రిలీజ్ అయిన ట్రైలర్ వన్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్సే దక్కించింది. ముఖ్యంగా యువకులను రెచ్చగొట్టేలా కొన్ని సన్నివేశాలను ట్రైలర్ లో ఉంచడం పట్ల కొండా మురళీ జీవిత చరిత్రను సినిమా ద్వారా తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది. తాజాగా రిలీజ్ చేసిన Konda Trailer 2 కూడా భయంకరంగానూ, ఆలోచనా జనితంగా ఉంది. అయితే ఈ ట్రైలర్ లో కొండాను మరింత వైలెంట్ గా, అగ్రెసివ్ గా చూపించారు. ‘విపరీత పరిస్థితుల నుంచి పుట్టిన వ్యక్తే కొండా మురళీ’ అంటూ చెప్పే డైలాగ్స్ కథపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. తను స్టూడెంట్ దశ నుంచి లీడర్ స్థాయికి ఎదిగే క్రమాన్ని చూపించారు. ఈక్రమంలో రక్తపాతం ఎక్కువగానే కనిపిస్తోంది. అలాగే కొండా సురేఖ, కొండా మురళీ లవ్ ట్రాక్ కు సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.  

రామ్ గోపాల్ దర్శకత్వంలో  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిగుణ్‌, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలో నటించారు. నటుడు పృథ్వీరాజ్, పార్వతి అరుణ్, ప్రశాంత్, ఎల్బీ శ్రీరామ్, తులసి, 'జబర్దస్త్' రామ్ ప్రసాద్, అభిలాష్ చౌదరి, శ్రవణ్, అనిల్ కుమార్ రెడ్డి లింగంపల్లి, గిరిధర్ చంద్రమౌళి, రవి, షబీనా కీలక పాత్రల్లో నటించారు. ఫైట్స్ : శ్రీకాంత్, మాటలు : భరత్,  ఛాయాగ్రహణం : మల్హర్ భట్ జోషి, సంగీతం డీఎస్ఆర్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి చంద్రబోస్, నల్లగొండ గద్దర్ అద్భుతమైన లిరిక్స్ అందించారు.

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?