నాకు పుట్టే బిడ్డకి దిశ పేరే పెడతా.. ఆర్జీవీతో చెన్నకేశవులు భార్య

prashanth musti   | Asianet News
Published : Feb 03, 2020, 03:10 PM ISTUpdated : Feb 03, 2020, 03:45 PM IST
నాకు పుట్టే బిడ్డకి దిశ పేరే పెడతా.. ఆర్జీవీతో చెన్నకేశవులు భార్య

సారాంశం

రామ్ గోపాల్ వర్మ అంటే ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీతో తనకు తాను పబ్లిసిటి క్రియేట్ చేసుకుంటాడు అనేది అందరికి తెలిసిన విషయం. ఆర్జీవీ ఏం చేసినా ఆయనను అభిమానించే వాళ్ళు ఉంటారు. తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సీనియర్ దర్శకుడు దిశా ఘటనలో ఒక విషయంపై బాగా ఎమోషనల్ అయ్యాడు. 

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీతో తనకు తాను పబ్లిసిటి క్రియేట్ చేసుకుంటాడు అనేది అందరికి తెలిసిన విషయం. ఆర్జీవీ ఏం చేసినా ఆయనను అభిమానించే వాళ్ళు ఉంటారు. తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సీనియర్ దర్శకుడు దిశా ఘటనలో ఒక విషయంపై బాగా ఎమోషనల్ అయ్యాడు.

అలాగే తనలో ఒక సహాయం చేసే వ్యక్తి కూడా ఉన్నాడని ఆర్జీవీ తెలుపడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. దిశా హత్యాచార ఘటనలో నిందితుడైన చెన్నకేశవులు భార్య రేణుకతో అర్జీవి ఇంటర్వ్యూ చేశాడు. ప్రస్తుతం రేణుక పరిస్థితిపై చర్చించిన వర్మ ఆమెకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి సిద్దమయ్యాడు. అంతే కాకుండా అందరూ మానవత్వ దృక్పధంతో ఆలోచింది ఆమెకు అండగా నిలవాలని పిలుపునిచ్చాడు. ఇది ఇలా ఉండగా.. చెన్నకేశవులు భార్య కూడా ఆర్జీవీతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తనకు పుట్టే బిడ్డకి 'దిశ' అని పేరు పెడతానని ఈ సందర్భంగా ఆర్జీవీతో చెప్పారు. ఈ విషయాన్ని వర్మ స్వయంగా వెల్లడించారు. 

ఇకపోతే దిశ ఘటనపై ఆర్జీవీ సినిమా చేయనున్నట్లు ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కథపై రీసెర్చ్ మొదలుపెట్టిన వర్మ ఫుల్ స్క్రిప్ట్ ని వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ అనుకుంటున్నాడు. చాలా రోజుల తరువాత వర్మ ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని టేకప్ చేయడమే కాకుండా.. దిశ ఘటనపై ఎమోషనల్ అవ్వడం ఆడియెన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరీ ఆ సినిమాతో అర్జీవి ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

దిశా కేసు: చెన్నకేశవులు భార్యని కలసిన వర్మ.. ఎమోషనల్ కామెంట్స్!

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?