పవన్ సినిమాలో రేణుదేశాయ్.. అసలు నిజమిదే!

By AN Telugu  |  First Published Feb 1, 2020, 3:59 PM IST

 ఫిల్మ్ నగర్ ఇన్నర్ సర్కిల్స్ లో చెప్పుకునేదాన్ని బట్టి... రేణు దేశాయ్ ని తమ సినిమాలో తీసుకుంటే బాగుంటుందనేది దిల్ రాజు ఆలోచనగా చెప్తున్నారు. దీనికి మొదట పవన్ పెద్దగా ఆసక్తి చూపకపోయినా ఒప్పించారని చెప్తున్నారు. 


కొన్ని వార్తలు వింటానికి చాలా క్రేజీగా ఉంటాయి. అయితే వాటిల్లో నిజమెంత అనేది అనుమానస్పందంగానే ఉంటుంది. ఇప్పుడు అలాంటి వార్తే టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రయాణిస్తోంది. నిన్నటి నుంచి మీడియాలో ..పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న పింక్ రీమేక్‌లో రేణు దేశాయ్ నటించబోతుందనే వార్త ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్‌కి తల్లిగా రేణు దేశాయ్ కనిపించనున్నట్టు వినిపిస్తోంది. అయితే అందుకు రేణు దేశాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా...పవన్ ఒప్పుకున్నారా అనేది మాత్రం క్లారిటీ లేదు.

అయితే ఫిల్మ్ నగర్ ఇన్నర్ సర్కిల్స్ లో చెప్పుకునేదాన్ని బట్టి... రేణు దేశాయ్ ని తమ సినిమాలో తీసుకుంటే బాగుంటుందనేది దిల్ రాజు ఆలోచనగా చెప్తున్నారు. దీనికి మొదట పవన్ పెద్దగా ఆసక్తి చూపకపోయినా ఒప్పించారని చెప్తున్నారు. దాంతో రేణు దేశాయ్ దగ్గర ప్రపోజల్ పెట్టారట. నటిగా తను పవన్ సినిమాలో చేయటానికి సమస్య ఏమీ లేదని, అయితే తన పాత్ర సినిమాలో ఏ మేరకు కీలకంగా ఉంటుందనే దానిపై ఆలోచించి చెప్తానని ఆమె చెప్పారట.

Latest Videos

undefined

'ఇదిరా న్యూస్ అంటే..' మైత్రితో పవన్ సినిమా.. ఫ్యాన్స్ కి పూనకాలే!

ఈ మేరకు దర్శకుడు వేణు శ్రీరామ్ ..తాము అనుకున్న పాత్రను ఆమెకు వినిపించారని, ఇంటర్వెల్ దగ్గర ఆ పాత్ర ప్రవేశిస్తుందని చెప్పారని తెలుస్తోంది. అయితే క్యారక్టర్ లెంగ్త్ చాలా తక్కువ ఉండటంతో,తన రీఎంట్రీకు ఇది సరిదగ్గ సినిమానేనా అనే విషయంలో ఆమె ఆలోచనలో పడిందని చెప్తున్నారు. దాంతో ఆమె నటించే విషయం ఖరారు కాలేదని అంటున్నారు.

ఇక  ఇదే కనుక నిజమైతే మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు  అంతకంటే కానుక ఏముంటుంది..?  ఒక‌ప్పుడు వరస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన రేణూ దేశాయ్‌.. ప‌వ‌న్‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కి పూర్తిగా దూరంగా ఉంది. పవన్ కళ్యాణ్  నుండి విడాకులు తీసుకున్న త‌ర్వాత ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కురాలిగా కొన్ని సినిమాల‌కి ప‌ని చేసింది. కాని వెండితెర‌పై కనపడింది లేదు. రీసెంట్ గా విడుద‌లైన ‘చూసీ చూడంగానే’ చిత్రంలో తల్లి క్యారెక్టర్‌ చేసే అవకాశం వచ్చినప్పటికీ ఆరోగ్య స‌మస్య వ‌ల‌న తాను సినిమాలో న‌టించ‌లేక‌పోయింది.  

click me!