#Agent: సంక్రాంతి రేసు నుంచి 'ఏజెంట్' అవుట్,మరెప్పుడు రిలీజ్ అంటే...

Published : Nov 07, 2022, 06:45 AM IST
#Agent: సంక్రాంతి రేసు నుంచి 'ఏజెంట్' అవుట్,మరెప్పుడు రిలీజ్ అంటే...

సారాంశం

సంక్రాంతి బ‌రిలో బాల‌కృష్ణ `వీరసింహారెడ్డి`, చిరంజీవి `వాల్తేరు వీర‌య్య‌`, ప్ర‌భాస్ `ఆదిపురుష్‌` చిత్రాల‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆఖ‌రికి ప‌ర‌భాషా చిత్ర‌మైన విజ‌య్ ద‌ళ‌ప‌తి `వార‌సుడు`కు సైతం మంచి హైప్ క్రియేట్ అయింది. కానీ, `ఏజెంట్‌`కు ఇప్ప‌టికైతే ఎలాంటి బ‌జ్ నెల‌కొన‌లేదు.


సంక్రాంతి రేసులోకి అక్కినేని హీరో అఖిల్ చేరారంటూ కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. స్పై యాక్షన్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. దీపావళి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను వెల్లడించారు. అయితే ఇప్పుడు సంక్రాంతి రేస్ నుంచి అఖిల్ తప్పుకున్నారు. మరి ఎప్పుడు ఈ సినిమా రాబోతోంది అనే విషయం ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

 సంక్రాంతి రేసులో ఇప్పటికే చిరంజీవి వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు విజయ్ వారసుడు, ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అనూహ్యంగా అఖిల్ ఏజెంట్ రేసులోకి రావడంతో సంక్రాంతి పోరు ఆసక్తికరంగా మారింది. కాకపోతే ఆదిపురుష్ సినిమా వాయిదా పడిందని అంటున్నారు. సంక్రాంతికి   `ఏజెంట్‌` మూవీ విడుద‌ల అవుతుంద‌న్న విష‌యాన్నే ఎవ‌రూ గ‌మ‌నించ‌డం లేదు. పైగా చిత్ర యూట్ స‌రైట్ అప్డేట్స్ కూడా ఇవ్వ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే సంక్రాంతి బ‌రిలో దిగుతున్న `ఏజెంట్‌` నిల‌బ‌డ‌గ‌ల‌దా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. దాంతో  ఇప్పుడు అఖిల్ ఏజెంట్ కూడా రేస్ నుంచి తప్పుకుంది.  అందుతున్న సమాచారం మేరకు ...ఏజెంట్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కొలిక్కి రాలేదు. టైమ్ పట్టేటట్లు ఉంది. దాంతో అన్నీ పూర్తి చేసుకుని మంచి పబ్లిసిటీతో  శివరాత్రికి ఈ సినిమా రాబోతోందని సమాచారం.

ఏజెంట్ సినిమా కోసం తన లుక్,గెటప్ పూర్తిగా మార్చుకున్నాడు అఖిల్. ఫిజికల్ గా చాలా మేకోవర్ అయి ఈ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇందులో ఎయిట్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఏజెంట్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. పాన్ ఇండియన్ స్థాయిలో సౌత్ లాంగ్వేజెస్ తో పాటు బాలీవుడ్ లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఏజెంట్ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయం అవుతోంది. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందిస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?