రష్మిక ఇంటికి ఐటి నోటీసులు.. ఫైనల్ క్లారిటీ ఇచ్చిన మేనేజర్

By Prashanth MFirst Published Jan 21, 2020, 8:22 AM IST
Highlights

సౌత్ హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపై ఆదాయం పన్ను శాఖ వారు రెయిడ్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అక్రమాస్తులు కూడగట్టుకున్నారనే కారణం చేత రష్మిక ఇంటిపై అధికారులు నోటీసులు జారీ చేసినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. 

గతవారం సౌత్ హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపై ఆదాయం పన్ను శాఖ వారు రెయిడ్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అక్రమాస్తులు కూడగట్టుకున్నారనే కారణం చేత రష్మిక ఇంటిపై అధికారులు నోటీసులు జారీ చేసినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. అయితే అదంతా అబద్దమని రష్మిక పర్సనల్ మేనేజర్ మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అసలు వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఆమె స్వస్థలం విరాజ్ పెటెలోని నివాసంలో గురువారం ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంటిలోనే కాకుండా రష్మిక కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న కల్యాణ్ మండపంలో జరిపిన ఐటి సోదాల్లో రూ. 25 లక్షల నగదును, పలు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నగదుకు సంబంధించిన పత్రాలను రష్మిక తల్లిదండ్రులు చూపలేకపోయారని కూడా తెలిసింది.

ఈ నెల 21వ తేదీన బెంగళూరు, మైసూరు కార్యాలయాల్లో హాజరై వాటి వివరాలు అందించాలని ఐటి శాఖ అధికారులు రష్మిక ఇంటికి నోటీసులు పంపించారు. అయితే ఆ పత్రాలు కేవలం ఆమె తండ్రికి పంపినట్లు రష్మిక మేనేజర్ తెలిపారు. ఐటి అధికారులు రష్మిక తండ్రి ఆస్తులపై మాత్రమే దాడులు చేశారని ఈ విషయంలో నటికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కొందరు కావాలని రష్మికపై అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు కూడా మేనేజర్ వివరణ ఇచ్చారు.

Also Read: రష్మిక ఇంటిపై ఐటీ దాడులు.. రూ.25 లక్షలు స్వాధీనం!

click me!