నెటిజన్ విమర్శ.. కూల్ గా బుద్ధిచెప్పిన భల్లాల దేవుడు

Published : Feb 11, 2020, 09:31 PM ISTUpdated : Feb 11, 2020, 09:58 PM IST
నెటిజన్ విమర్శ.. కూల్ గా బుద్ధిచెప్పిన భల్లాల దేవుడు

సారాంశం

భల్లాల దేవుడు రానా దగ్గుబాటి నటించిన తాజా చిత్రం అరణ్య. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఏప్రిల్ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్ లో రానా భయంకరమైన లుక్ లో కనిపిస్తూ అదరగొడుతున్నాడు. 

రానా లుక్ పై అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చిత్ర యూనిట్ కూడా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. రానా లుక్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ మాత్రం రానాపై విమర్శలు గుప్పించేందుకు ప్రయత్నించాడు. 

దిశ కేసు: హడావిడి చేసిన ఆర్జీవీ.. చెన్నకేశవులు భార్యకు చేసిన సాయం ఇదా!

రానా ఓ ఇంటర్వ్యూలో తాను పదో తరగతి ఫెయిల్.. అయినా నా కలలని ఏవీ ఆపలేకపోయాయి అని చెప్పిన వీడియోను నెటిజన్  పోస్ట్ చేశాడు. ఆ కామెంట్స్ కు సదరు నెటిజన్ కౌంటర్ ఇస్తూ.. ఎందుకంటే రానా వెనుక పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉంది అని విమర్శించాడు. 

దిశ కేసు: హడావిడి చేసిన ఆర్జీవీ.. చెన్నకేశవులు భార్యకు చేసిన సాయం ఇదా!

సదరు నెటిజన్ విమర్శకు రానా ఆగ్రహించుకోలేదు. చాలా కూల్ గా బదులిచ్చాడు. 'ఏమీ లేదు బ్రదర్.. మనం నటన అనే కళ నేర్చుకోకుంటే ఎంత పెద్ద నిర్మాణ సంస్థ ఉన్నా వేస్టే' అని బదులిచ్చాడు. ప్రస్తుతం రానా.. వేణు ఊడుగుల దర్శత్వంలో విరాటపర్వం అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?