మెగా ఫ్యాన్ మృతి.. నూర్ భాయ్ ఫ్యామిలీకి రాంచరణ్ రూ.10 లక్షల సాయం

Published : Dec 09, 2019, 02:54 PM ISTUpdated : Dec 09, 2019, 02:57 PM IST
మెగా ఫ్యాన్ మృతి.. నూర్ భాయ్ ఫ్యామిలీకి రాంచరణ్ రూ.10 లక్షల సాయం

సారాంశం

మెగా ఫ్యామిలీ వీరాభిమాని నూర్ మహమ్మద్ ఆదివారం హైదరాబాద్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. నూర్ మహమ్మద్ మృతి మెగా ఫ్యామిలీకి పెద్ద లోటే అని చెప్పాలి.

మెగా ఫ్యామిలీ వీరాభిమాని నూర్ మహమ్మద్ ఆదివారం హైదరాబాద్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. నూర్ మహమ్మద్ మృతి మెగా ఫ్యామిలీకి పెద్ద లోటే అని చెప్పాలి. ఎందుకంటే దశాబ్దాల కాలంగా నూర్ మహమ్మద్ మెగాస్టార్ చిరంజీవి అన్నా, ఆయన కుటుంబం అన్నా అమితమైన అభిమానాన్ని ప్రదర్శించేవారు. 

గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. హైదరాబాద్ లో మెగా హీరోలకు సంబంధించిన ఏ ఈవెంట్ జరిగినా నూర్ మహమ్మద్ పాల్గొనేవారు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న అభిమాని మరణించడంతో చిరంజీవి సహా మెగా హీరోలందరితో విషాదం నెలకొంది. 

ఆదివారం రోజు రాంచరణ్, చిరంజీవి, అల్లు అర్జున్ నూర్ మహమ్మద్ కుటుంబ సభ్యులని పరామర్శించారు. పెద్ద దిక్కుని కోల్పోవడంతో నూర్ మహమ్మద్ కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. దీనితో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అతడి కుటుంబ సభ్యులని ఆదుకునే ప్రయత్నం చేశారు. 

అభిమాని మృతి: నివాళులర్పించిన చిరంజీవి, అల్లు అర్జున్.. ఫొటోస్!

తాజాగా రాంచరణ్ నూర్ మహమ్మద్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాడు. తమ ఫ్యామిలీపై ఇంతటి అభిమానాన్ని ప్రదర్శించిన నూర్ మహమ్మద్ కుటుంబ సభ్యులని ఆదుకోవాలనే ఉద్దేశంతో రాంచరణ్ ఈ ఆర్థిక సాయం ప్రకటించారు. 

మెగా వీరాభిమాని మృతి.. దిగ్భ్రాంతిలో రాంచరణ్, ఆ ప్రకటన వాయిదా వేసిన బన్నీ!

మెగాస్టార్ చిరంజీవి మొదలుకుని పవన్ కళ్యాణ్, నాగబాబు, రాంచరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ఇలా ప్రతి ఒక్కరితో నూర్ మహమ్మద్ సన్నిహితంగా మెలిగేవారు. తాము నూర్ భాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి మరణించడంతో మెగా ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంతాపం తెలియజేశారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?