పవన్ 'నో' చెప్పిందే... రామ్ చేయబోతున్నాడు!

By AN Telugu  |  First Published Feb 15, 2020, 9:17 AM IST

కెరీర్ ప్రారంభంలోనే సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసిన బాబి. ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ, వెంకటేష్ తో చేసిన వెంకీ మామ యావరేజ్ అనిపించుకున్నాయి. 


ఒక హీరోకు అనుకున్న సబ్జెక్టు...మరో హీరో ఓకే చేసి పట్టాలెక్కించటం సినిమా పరిశ్రమలో సర్వ సామాన్యం. అయితే సీనియర్ హీరోకు అనుకున్న సబ్జెక్టులు సాధారణంగా యంగ్ హీరోలకు సెట్ కావు. కానీ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథని హీరో రామ్ ఓకే చేసినట్లు సమాచారం.  చిన్న చిన్న మార్పులు చేస్తే తన ఇమేజ్ కు సరిపోతుందని రామ్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట. రామ్ కెరీర్ ప్రారంభంలో పూర్తిగా పవన్ ని అనుకరించేవాడన్న విషయం తెలిసిందే. ఇంతకీ ఆ కథ రాసిన దర్శకుడు ఎవరంటారా...

కెరీర్ ప్రారంభంలోనే సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసిన బాబి. ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ, వెంకటేష్ తో చేసిన వెంకీ మామ యావరేజ్ అనిపించుకున్నాయి. ఆ హీరోల స్టామినాని బట్టి ఆ మాత్రం కలెక్షన్స్ వచ్చాయని ఇండస్ట్రీకి అర్దమై..బాబితో సినిమా చెయ్యటానికి హీరోలు ఎవరూ పెద్దగా ఉత్సాహం చూపటం లేదు. ఈ నేపధ్యంలో మళ్లీ పవన్ వరస పెట్టి సినిమాలు చేస్తున్నారని తెలుసుకుని ఓ కథ పట్టుకుని పవన్ కలిసారు బాబి.

రిలీజ్ కు ముందే పవన్ సినిమాకు 60 కోట్లు.. నిజామా?

అయితే బాబి చెప్పిన స్టోరీ లైన్ ..పవన్ కు నచ్చలేదని సమాచారం. అందులోనూ ఆ ప్రాజెక్టుకు ఎక్కువ డేట్స్ అవసరం అవుతాయని, ఇప్పుడు తాను ఉన్న పరిస్దితుల్లో అన్నేసి రోజులు ఒకే సినిమాకు కేటాయించలేమని చెప్పారట. దాంతో ఆ కథని ఎవరికి చెప్తే  బాగుంటుంని ఆలోచించి రామ్ దగ్గరకు వచ్చి నేరేట్ చేసారట. బేసిక్ గా బాబి రైటర్ కావటంతో చిన్న చిన్న మార్పులు అదే స్క్రిప్టుకు స్పీడుగా చేసి రామ్ కు చెప్పి ఒప్పించినట్లు సమాచారం.

 రామ్ ప్రస్తుతం రెడ్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఏప్రియల్ 9 న రిలీజ్ అయ్యే ఈ చిత్రం కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అది ఓ రీమేక్. ఆ తర్వాత బాబి దర్శకత్వంలో మొదలయ్యే సినిమా పట్టాలు ఎక్కనుందని సమాచారం.
 

Latest Videos

click me!