వర్మకు పెళ్లి మీద గాలి మళ్లింది.. అతన్ని పెళ్లి చేసుకుంటాడట!

By Satish ReddyFirst Published Apr 23, 2020, 10:39 AM IST
Highlights

దళపతి సినిమాలో రజనీకాంత్, మమ్ముట్టిల మీద రూపొందించిన తమిళ పాటను భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌లు పాడుతున్నట్టుగా ఎడిట్ చేశాడు ఓ వ్యక్తి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో దాన్ని వర్మ షేర్ చేశాడు. 

తన సినిమాలతోనే కాదు తన సోషల్ మీడియా పోస్ట్ లతో కూడా మీడియాకు కావాల్సినంత ఎంటర్‌టైన్మెంట్ ఇస్తుంటాడు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ. ఇటీవల సినిమాలతో సక్సెస్ అందుకోలేకపోతున్న వర్మ, ఆ సినిమాలకు పబ్లిసిటీ ఇవ్వటంలో మాత్రం సూపర్‌ హిట్ అవుతున్నాడు. తాజాగా ఈ వివాదాస్పద దర్శకుడు మరో ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దళపతి సినిమాలో రజనీకాంత్, మమ్ముట్టిల మీద రూపొందించిన తమిళ పాటను భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌లు పాడుతున్నట్టుగా ఎడిట్ చేశాడు ఓ వ్యక్తి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో దాన్ని వర్మ షేర్ చేశాడు. అంతేకాదు వీడియోను షేర్ చేయటంతో పాటు ఆ పాటను ఎడిట్ చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుందట ట్వీట్ చేశాడు ఆర్జీవీ. ఈ వీడియోపై నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ప్రస్తుతం కరోనా సందర్భంగా తన అభిప్రాయాలను వెల్లడించటంతో పాటు ఫన్నీ ట్వీట్స్‌తో నెటిజెన్లను అలరిస్తున్నాడు ఆర్జీవి. అంతేకాదు తాజాగా కరోనా పై ఓ సినిమాను కూడా రూపొందిస్తున్నట్టుగా ప్రకటించాడు. 

I want to marry this editor 😍 pic.twitter.com/1qOiZ9KXbv

— Ram Gopal Varma (@RGVzoomin)
click me!