బాలీవుడ్‌ హీరోను చాలెంజ్‌ చేసిన చెర్రీ.. బెస్ట్‌ ఫ్రెండ్స్‌కు కూడా!

Published : Apr 21, 2020, 02:42 PM ISTUpdated : Apr 21, 2020, 02:56 PM IST
బాలీవుడ్‌ హీరోను చాలెంజ్‌ చేసిన చెర్రీ.. బెస్ట్‌ ఫ్రెండ్స్‌కు కూడా!

సారాంశం

రాజమౌళి చాలెంజ్‌ను స్వీకరించిన ఎన్టీఆర్ ఇప్పటికే తన వీడియోను పోస్ట్ చేసి టాలీవుడ్‌ సీనియర్ హీరోలను చాలెంజ్‌ చేశాడు. తాజాగా రామ్ చరణ్‌ కూడా ఇంటి పనులు చేస్తున్న వీడియోను షేర్ చేశాడు.

"అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా మొదలు పెట్టిన బీ ద రియల్ మ్యాన్ చాలెంజ్‌ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. తన ఇంటి పనులు చేస్తూ ఓ వీడియో తీసుకున్న సందీప్ రెడ్డి ఆ వీడియోను షేర్‌ చేస్తూ దీన్ని ముందుకు తీసుకువెళ్లాలంటూ దర్శక ధీరుడు రాజమౌళిని కోరాడు. వెంటనే స్పందించిన రాజమౌళి తను కూడా ఇంటి పనులు చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోలతో పాటు కీరవాణి, శోభు, సుకుమార్‌లను చాలెంజ్‌ చేశాడు.

రాజమౌళి చాలెంజ్‌ను స్వీకరించిన ఎన్టీఆర్ ఇప్పటికే తన వీడియోను పోస్ట్ చేసి టాలీవుడ్‌ సీనియర్ హీరోలను చాలెంజ్‌ చేశాడు. తాజాగా రామ్ చరణ్‌ కూడా ఇంటి పనులు చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. ఇంట్లోని మహిళలకు సాయం చేస్తూ నిజమైన మగాళ్లు అనిపించుకోవాలన్న చరణ్‌.. తన బెస్ట్ ఫ్రెండ్స్‌ రానా దగ్గుబాటి, శర్వానంద్‌ లతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌, బాలీవుడ్‌ హీరో రణవీర్‌ సింగ్‌ లను చాలెంజ్‌ చేశాడు.
"

టాలీవుడ్ డైరెక్టర్ మొదలు పెట్టిన ఈ బీ ద రియల్‌ మెన్‌ చాలెంజ్‌ను ఇప్పుడు రామ్ చరణ్ బాలీవుడ్‌కు కూడా తీసుకెళ్లాడు. దీంతో బాలీవుడ్‌లో కూడా ఈ సరికొత్త చాలెంజ్‌ హవా చూపించనుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆర్ఆర్‌ఆర్‌ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు చరణ్‌. లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్ ఆగిపోవటంతో ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు. షూటింగ్ లేకపోవటంతో డబ్బింగ్ పనులు కానిచ్చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?