యాంకర్ రవికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన అనసూయ!

Published : Apr 21, 2020, 01:40 PM ISTUpdated : Apr 21, 2020, 01:49 PM IST
యాంకర్ రవికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన అనసూయ!

సారాంశం

యూట్యూబ్‌ వీడియోలు చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు యాంకర్‌ రవి. ఈ సందర్బంగా రవి ఓ ప్రాంక్ వీడియో చేశాడు. అందులో భాగంగా మరో స్టార్‌ యాంకర్‌ అనసూయకు ఫోన్‌ చేసిన తాను హెల్త్ డిపార్ట్‌మెంట్‌ నుంచి మాట్లాడుతున్నట్టుగా ఆటపట్టించాడు.

జబర్దస్త్‌ బ్యూటీ అనసూయ తన గ్లామర్‌తో ఎంత పాపులరో వివాదాలతోనూ అంతే పాపులర్. తరుచూ ఎదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ తాజాగా మరో స్టార్ యాంకర్‌ రవిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిందట. సమయం కానీ సమయంలో అల్లరి ఏంటీ అంటూ కాస్త గట్టిగానే గడ్డి పెట్టిందట.

అసలు విషయానికి వస్తే లాక్ డౌన్‌ కారణంగా యాంకర్లు కూడా అంతా ఇంట్లోనే ఉన్నారు. ఎనర్జిటిక్‌ యాంకర్‌ రవి కూడా ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యాడు. తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న రవి, అడపాదడపా యూట్యూబ్‌ వీడియోలు చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు. ఈ సందర్బంగా రవి ఓ ప్రాంక్ వీడియో చేశాడు. అందులో భాగంగా మరో స్టార్‌ యాంకర్‌ అనసూయకు ఫోన్‌ చేసిన తాను హెల్త్ డిపార్ట్‌మెంట్‌ నుంచి మాట్లాడుతున్నట్టుగా ఆటపట్టించాడు.

అయితే ఈ ప్రాంక్ మిస్‌ ఫైర్‌ అయ్యింది. ఈ సమయంలో ఇలాంటి ప్రాంక్‌ లు చేస్తారా అంటూ అనసూయ, రవిపై తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యిందట. రవి, అనసూయల మధ్య సరదాగా ఆట పట్టించేంత చనువు ఉన్నా.. ఇది సరైన సమయం మాత్రం కాదని ఆమె సీరియస్‌ అయ్యింది. కరోనా తో ప్రజలంతా భయాందోళనలో ఉన్న సమయంలో ఇలాంటి ప్రాంక్‌లు సరికాదంటున్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?