RRR అన్ని అడ్డంకులను దాటింది.. అందులో తక్కువని భావించం.. రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

By Asianet News  |  First Published Mar 9, 2023, 1:29 PM IST

‘ఆస్కార్స్’ బరిలో నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం అన్ని అడ్డంకులను దాటిందని మెగా  పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అన్నారు. ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియన్ సినిమాపై ఆసక్తికరంగా  స్పందించారు.  
 


‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ క్రేజ్ అంతకంతకు పెరిగింది. చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ ఏకంగా ‘ఆస్కార్స్’కు నామినేట్ కావడంతో ఇండియన్ సినిమా స్థాయిని పెంచేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆస్కార్స్ వేడుకకు హాజరయ్యేందుకు అమెరికాలో ప్రమోషన్స్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయా హాలీవుడ్ స్టూడియెస్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా  డెడ్ లైన్ (Deadline) మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియన్ సినిమాలో ఆర్ఆర్ఆర్ తో వచ్చిన  మార్పు, ప్రపంచ వ్యాప్తంగా అందుతున్న ప్రశంసలపై స్పందించారు.

చరణ్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ అన్ని అడ్డంకులను అధిగమించిన చిత్రమన్నారు. బహుళ-భాషా, బహుళ-జాతి దేశమైన ఇండియాలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వంటి విభిన్న పరిశ్రమలు ఉన్నాయి. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఆయా ఇండస్ట్రీల మధ్య వైవిధ్యంపై తను అవిశ్వాసంగానే ఉంటానన్నారు. సినిమాకు భాషా, ప్రాంత బేధం లేదని తెలిపారు. కానీ, భారతదేశంలోని వైవిధ్యాన్ని ఇష్టపడుతున్నానన్నారు. ఇండియన్ డైవర్సిటీలోని గొప్ప విషయం.. మరొక ప్రాంతం కంటే మన ప్రాంతానికి ఎప్పుడూ తక్కువ ప్రాముఖ్యత ఉందని భావించకపోవడం. ఈ క్రమంలో మాకు సొంత పరిశ్రమలు, ఎకనామీ, ఫ్యాన్స్ ఉన్నారు’ అంటూ ఆసక్తికరంగా స్పందించారు.  

Latest Videos

తెలుగులో రూపొందిన బ్లాక్ బాస్టర్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న సంస్కృతి మార్పును సూచిస్తుందంటూ చెప్పుకొచ్చారు.  ఇక RRR పూర్తి చేశాకా.. అప్పటికే గొప్పగా చేశామన భావించామన్నారు.  కానీ చిత్రం విడుదలై ఏడాది గడిచినా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆదరణ అద్భుతమైన అనుభూతిని కలిగించిందన్నారు. ఎప్పటికీ మరిచిపోలేనిదన్నారు. ముఖ్యంగా సినిమాలో మేం శ్రద్ధ పెట్టిన చేసిన ప్రతి పనికి, చిన్న రియాక్షన్ కు కూడా గుర్తింపు దక్కిందన్నారు. అందుకు నటుడిగా చాలా సంతృప్తికరంగా ఉందన్నారు. 

మార్చి 12న అమెరికాలో జరగున్న ‘ఆస్కార్స్ 2023’ అవార్డుల వేదికలో పాల్గొనేందుకు త్రిపుల్ ఆర్ టీమ్ ఇప్పటికే అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చరణ్ సైతం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్ గా మారిన చరణ్ త్వరలో హాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ అనౌన్స్ చేయనున్నారు. 
 

click me!