ఫ్లాట్ కొనుక్కున్న రకుల్.. ఎంతో తెలుసా..?

Published : Nov 23, 2019, 04:56 PM IST
ఫ్లాట్ కొనుక్కున్న రకుల్.. ఎంతో తెలుసా..?

సారాంశం

హైదరాబాద్ లో సొంతంగా ఓ ఇల్లు కూడా కొనుక్కుంది. ఇప్పుడు బెంగుళూరులో కూడా ఖరీదైన ఫ్లాట్ తీసుకుందని తెలుస్తోంది. దీని విలువ రూ.6 కోట్లకు పైగానే ఉంటుందట. 

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అందుకే తమకి క్రేజ్ ఉన్న సమయంలో వీలైనన్ని ఎక్కువ సినిమాల్లో నటించి సంపాదించుకుంటూ ఉంటారు. ఆ డబ్బుని పలు రకాల వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తూ బ్యాకప్ పెట్టుకుంటారు.

దాదాపు ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లంతా చేసే పని ఇదే. కొందరు జ్యూలరీ షాప్స్ పెట్టుకుంటే మరికొందరు బట్టలు, కాస్మటిక్స్ వ్యాపారాలు చేస్తున్నారు. నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇదే బాటలో జిమ్ వ్యాపారం మొదలుపెట్టింది. 

విలువలు చంపుకొని పని చేయలేను : సాయి పల్లవి

'ఎఫ్45' అనే ఫ్రాంచైజీ ఓపెన్ చేసి హైదరాబాద్, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో పలు బ్రాంచ్ లు ఓపెన్ చేస్తుంది. హైదరాబాద్ లో సొంతంగా ఓ ఇల్లు కూడా కొనుక్కుంది. ఇప్పుడు బెంగుళూరులో కూడా ఖరీదైన ఫ్లాట్ తీసుకుందని తెలుస్తోంది. దీని విలువ రూ.6 కోట్లకు పైగానే ఉంటుందట. 

రకుల్ కి బెంగుళూరులో కొంతమంది స్నేహితులు ఉన్నారు. వారి సలహాలు, సూచనలు తీసుకునే బెంగుళూరులో ఫ్లాట్ తీసుకుందని సమాచారం. ఇప్పుడు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మాదిరి బెంగుళూరులో కూడా జిమ్ బ్రాంచీలు తెరవాలని చూస్తోందట.

ఈ మధ్య కాలంలో రకుల్ కి టాలీవుడ్ లో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. నితిన్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. తమిళంలో 'భారతీయుడు 2' చిత్రంలో నటిస్తోంది. అలానే బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ బ్యూటీ రెండు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది.  
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?