'తోలు బొమ్మలాట' ఎలా ఉంది, కథేంటి..?

By AN TeluguFirst Published Nov 23, 2019, 9:43 AM IST
Highlights

బావమరదళ్ళు రిషి, వర్షిత ప్రేమించుకుని,.. పెళ్లి  చేసుకోవాలని అనుకుంటారు. కానీ వాళ్ళ పేరెంట్స్ మధ్య విభేధాలు ఉండటంతో...  మా పెళ్లిని మీరే జరిపించాలని వాళ్ళ తాతయ్య అయినా సోమరాజు అలియాస్ సోడా రాజు (రాజేంద్ర ప్రసాద్) వెళ్లి అడుగుతారు. 

 

తాను చేసిన 'ఆ నలుగురు సినిమా' తర్వాత నాకు బాగా నచ్చిన కథ ఇది అని 'తోలుబొమ్మలాట' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు నటకిరీటి రాజేంద్రప్రసాద్. దాంతో ఓ వర్గంలో ఈ సినిమాపై ఇంట్రస్ట్ కలిగింది. మరో ప్రక్క ఈ సినిమా ట్రైలర్, పాటలు సినిమాపైన మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. అనుకున్నట్లుగానే  ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మాటల్లేవు, అంతా కళ్లతోనే.. : ఎవరీ మౌనరాగం అమ్ములు?
 
ఇక కథ విషయానికి వస్తే...  

బావమరదళ్ళు రిషి, వర్షిత ప్రేమించుకుని,.. పెళ్లి  చేసుకోవాలని అనుకుంటారు. కానీ వాళ్ళ పేరెంట్స్ మధ్య విభేధాలు ఉండటంతో...  మా పెళ్లిని మీరే జరిపించాలని వాళ్ళ తాతయ్య అయినా సోమరాజు అలియాస్ సోడా రాజు (రాజేంద్ర ప్రసాద్) వెళ్లి అడుగుతారు. సరే అన్న సోమరాజు ఓ రోజు నిద్రలోనే చనిపోతాడు. ఆ తర్వాత రిషి, వర్షితల మధ్య మనస్పర్థల రావడం వల్ల వారు విడిపోతారు.

ఇదంతా చనిపోయిన సోమరాజు ఓ ఆత్మ రూపంలో తన కుటుంబం చూట్టూ తిరుగుతూ చూస్తూ ఉంటాడు. ఆ యువ జంట రిషి, వర్షితలకి ఇచ్చిన మాటను నేరవేర్చలేకపోయానని బాధ పడుతుంటాడు.అంతేకాదు తన మరణం తర్వాత ఆస్థి పంపకాల మధ్య తన పిల్లలుగొడవ పడడం చూసి తట్టుకోలేకపోతాడు.

అప్పుడు ఆత్మలు కనిపించే తన చుట్టం అయిన సంతోష్ తగులుతాడు. అతనితో సోమరాజు ఆత్మకి స్నేహం కుదురుతుంది. అక్కడ నుంచి తాను చేయాలనుకున్నా పనులన్నీ సంతోష్ తో చేయిస్తూ ఉంటాడు సోమరాజు..అందుకోసం సోమరాజు వేసిన ప్లాన్స్ ఏంటి ? మళ్ళీ రిషి, వర్షిత కలిశారా లేదా అన్న విషయాలు చుట్టూ సినిమా తిరుగుతుంది.

ఎలా ఉందంటే...


ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందీ అంటే జస్ట్ ఓకే , ఫరవాలేదు అంటున్నారు. ఎమోషనల్ కదిలిపోయేటంత కంటెంట్ లేదని చెప్తున్నారు.  అయితే ఈ స్పీడు డిజిటల్ యుగంలో తొలి చిత్రంగా ఇలాంటి కథని ధైర్యంగా ఎంచుకున్న దర్శకుడిని అభినందిచాలంటున్నారు. ఎలాంటి అసభ్యత లేకుండా ప్యూర్ ఫ్యామిలీ కథను తెరకెక్కించాడు. అయితే మంచి కథనిఎంచుకున్నా, కానీ తెరపైన అవిష్కరిచడంలో చాలాచోట్లల్లో తడపడ్డాడు దర్శకుడు.అలాగే చాలా చోట్ల బలంగా నొక్కి చెప్పాల్సిన సన్నివేశాలను కేవలం మాటలతోనే వదిలేశాడు. అయితే బావమరదళ్ల మధ్య లవ్ స్టొరీని ఫ్రెష్ గా తెరకెక్కించాడు. ఇక వెన్నల కిషోర్ తో వచ్చే కామెడి సీన్స్ కూడా బాగున్నాయి.  

click me!