Rajasekhar car accident: కారుపై ఇప్పటికే 3 ఓవర్‌స్పీడ్ చలాన్లు!

Published : Nov 13, 2019, 01:07 PM IST
Rajasekhar car accident: కారుపై ఇప్పటికే 3 ఓవర్‌స్పీడ్ చలాన్లు!

సారాంశం

ఈ క్రమంలో రాజశేఖర్ కారు(TS07FZ1234)పై ఉన్న చలాన్లను గమనిస్తే.. గతంలో కూడా 3 సార్లు ఓవర్‌స్పీడ్ చలాన్లు పడ్డాయి. రాచకొండ పరిధిలో ఒకటి, సైబరాబాద్ పరిధిలో మరో రెండు చలాన్లు ఉన్నాయి. 

ప్రముఖ హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు నిన్న రాత్రి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బోల్తా కొట్టిన సంగతి సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రాజశేఖర్ ఎలాంటి గాయాలపాలవ్వకుండా బయటపడ్డారు. కానీ ప్రమాదానికి గురైన కారు మాత్రం పూర్తిగా ద్యామేజీ అయింది. కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది.

అలానే కారు చక్రాలు ఊడిపోయాయి. మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వలనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో రాజశేఖర్ కారు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు.

ప్రమాదానికి కారణం అదే .. రాజశేఖర్ యాక్సిడెంట్ పై పోలీసులు!

ఈ క్రమంలో రాజశేఖర్ కారు(TS07FZ1234)పై ఉన్న చలాన్లను గమనిస్తే.. గతంలో కూడా 3 సార్లు ఓవర్‌స్పీడ్ చలాన్లు పడ్డాయి. రాచకొండ పరిధిలో ఒకటి, సైబరాబాద్ పరిధిలో మరో రెండు చలాన్లు ఉన్నాయి. మొత్తంరూ. 3వేల జరిమానా పెండింగ్‌లో ఉంది.

ఓఆర్ఆర్ నుంచి కారును తొలగించి పోలీసులు.. స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాక్సిడెంట్ విషయంపై స్పందించిన రాజశేఖర్ తనకు ఎలాంటి గాయాలు కాలేదని, క్షేమంగా బయటపడినట్లు చెప్పారు.

అలానే అతడి భార్య జీవిత కూడా జరిగిన విషయాన్ని వివరంగా వెల్లడించి.. తన భర్త క్షేమంగా బయటపడడానికి కారణం అభిమానులకు ఆయనపై ఉన్న ప్రేమే అని వెల్లడించింది. ఇటీవల 'కల్కి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజశేఖర్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్స్ ని సెట్ చేసే పనిలో పడ్డాడు.  

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?