‘రాజ రాజ చోర’ రిలీజ్ డేట్ ఇచ్చేసారు

By Surya PrakashFirst Published Aug 12, 2021, 8:32 AM IST
Highlights

శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘ ఆకాష్‌  హీరోయిన్ గా చేయగా సునైన ముఖ్యభూమిక పోషించారు. హితేశ్‌ గోలి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు. 

ఈ నెలలో వరస పెట్టి సినిమా రిలీజ్ లు కనపడుతున్నాయి. ఇప్పటికే ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా రిలీజైంది. ఈ సినిమా మంచి కలెక్షన్స్ దండుకుంటోందని వార్తలు వస్తున్నాయి. దాంతో మిగతా సినిమా నిర్మాతలు ఊపిరి పీల్చుకుని తమ సినిమాలను సైతం థియోటర్ లో వదలటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఆ క్రమంలో ఈ వారం పాగల్,సునీల్ కనపడటలేదు సినిమాలు వస్తున్నాయి. అలాగే  ఇప్పుడు శ్రీవిష్ణు హీరోగా వచ్చిన రాజ రాజ చోర సినిమా కూడా విడుదల డేట్ ఇచ్చేసారు.

శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘ ఆకాష్‌  హీరోయిన్ గా చేయగా సునైన ముఖ్యభూమిక పోషించారు. హితేశ్‌ గోలి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు. ఈ నెల 19న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. స్మార్ట్‌ దొంగగా ప్రేక్షకులకు వినోదం పంచేందుకు థియేటర్లలోకి రావడానికి శ్రీ విష్ణు సిద్ధమవుతున్నారు. 

 చోర కళలో ఆరితేరిన కుర్రాడిగా కిరీటం ధరించి శ్రీవిష్ణు చేసిన సందడి అలరిస్తోంది. ‘ఈ పాత్రతో మీ ముందుకు రావడం నా అదృష్టం. ఈ కిరీటం ధరించినందుకు మీ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తానన్నది నా శపథం’ అంటున్నారు శ్రీవిష్ణు. రవిబాబు పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చెప్పుకొనే ఓ దొంగ కథేమిటో తెలియాలంటే ‘రాజ రాజ చోర’ చూడాల్సిందే

 ‘‘హాయిగా నవ్వించే మంచి సినిమాల్ని చూడాలనేది ప్రేక్షకుల కోరిక. ఖాయంగా వినోదాన్ని పంచే చిత్రం మా ‘రాజ రాజ చోర’. ఇప్పటికే విడుదలైన  పోస్టర్స్, టీజర్, పాటలకి మంచి స్పందన లభించింది. చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుంది’’అని నిర్మాతలు తెలిపాయి. తనికెళ్ల భరణి, గంగవ్వ, అజయ్‌ ఘోష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ సాగర్‌, ఛాయాగ్రహణం: వేద రామన్‌.

 ఇదిలా ఉండగా... శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న మరో సినిమా ‘భళా తందనాన’ చిత్రీకరణ ఇటీవలే పునః ప్రారంభమైంది. చైతన్య దంతులూరి దర్శకత్వంలో రజనీ కొర్రపాటి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

click me!