పాతికేళ్ల క్రితం పూరి జగన్నాధ్ తీసిన ఫోటో.. కృష్ణ స్వయంగా కారులో తీసుకెళ్లారట

Published : May 31, 2020, 01:49 PM IST
పాతికేళ్ల క్రితం పూరి జగన్నాధ్ తీసిన ఫోటో.. కృష్ణ స్వయంగా కారులో తీసుకెళ్లారట

సారాంశం

సూపర్ స్టార్ కృష్ణ నేడు తన 77వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

సూపర్ స్టార్ కృష్ణ నేడు తన 77వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా చరిత్రలో ఓ సంచలనం. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతటి ప్రభావం చూపిన నటుడు. 

తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.. కృష్ణతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పాతికేళ్ల క్రితం పూరి జగన్నాధ్ స్వయంగా తీసిన కృష్ణ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'పాతికేళ్ల క్రితం నేను తీసిన ఫోటో ఇది . ఒకసారి కృష్ణ గారు నన్ను కార్ ఎక్కించుకుని తీసుకెళితే సంగీత్ లో సినిమా కూడా చూసాం . ఆయన సినిమాల కోసం క్యూ లో నిలుచునే వాడిని , ఆ రోజు ఆయన పక్కన కూర్చున్న . మరిచిపోలేను.. కృష్ణగారికి జన్మదిన శుభాకాంక్షలు అని పూరి జగన్నాధ్ ట్వీట్ చేశారు. 

సాంప్రదాయ వస్త్రధారణలో ఉన్న కృష్ణ ఫోటో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?