సూపర్ స్టార్ కృష్ణ రికార్డులు అనితర సాధ్యం.. బర్త్ డే విషెష్ తెలియజేసిన చిరంజీవి

By tirumala ANFirst Published May 31, 2020, 11:05 AM IST
Highlights

సూపర్ స్టార్ కృష్ణ నేడు తన 77వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. కృష్ణ 1965లో తేనె మనసులు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి కృష్ణకు తిరుగులేదు.

సూపర్ స్టార్ కృష్ణ నేడు తన 77వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. కృష్ణ 1965లో తేనె మనసులు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి కృష్ణకు తిరుగులేదు. ఎన్టీఆర్.. ఏఎన్నార్ లాంటి అగ్ర నటులకు ధీటుగా సినిమాలు చేస్తూ ఎదిగారు. కృష్ణ తన కెరీర్ 345 చిత్రాల్లో నటించారు. 

తన సినీ ప్రయాణంలో కృష్ణ ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. నేడు కృష్ణ జన్మదినం సందర్భంగా అభిమానులు, సెలెబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన సాధించిన ఘనతల్ని కొనియాడారు. 

'కథానాయకుడిగా 345 సినిమాలు, దర్శకుడిగా 14 చిత్రాలు, నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు.. మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే. మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే. అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత,సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని చిరంజీవి ట్వీట్ చేశారు. 

చిరంజీవి, కృష్ణ కలసి తోడు దొంగలు, కొత్తపేట రౌడీ లాంటి చిత్రాల్లో నటించారు. ఆ మధ్యన చిరంజీవి మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే. వేదికపై చిరు ప్రసంగిస్తూ.. కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని బహిరంగంగా కోరిన సంగతి తెలిసిందే. 

 

కథానాయకుడిగా 345 సినిమాలు దర్శకుడిగా 14 చిత్రాలు.నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు.మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే.మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే.అనితరసాధ్యం ఈ track record. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత,Superstar Krishna గారికి జన్మదినశుభాకాంక్షలు.💐 pic.twitter.com/6oa9wFg0Nn

— Chiranjeevi Konidela (@KChiruTweets)

 

 

click me!