#Project K:నాగ్ అశ్విన్ పోస్ట్ డీకోడ్..షాకింగ్ విషయాలు రివీల్

By Surya PrakashFirst Published Sep 1, 2022, 8:41 AM IST
Highlights

ఒకప్పుడు వేద వ్యాసునికి మహా భారతాన్ని రాయడానికి సహాయం చేశారు.. ఇప్పుడు మా భారతానికి కూడా మీ ఆశీర్వాదం కావాలి.. విఘ్నేశ్వరా.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని నాగ్ అశ్విన్ అన్న ట్వీట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఔమ్ రౌత్ ‘ఆదిపురుష్’, ప్రశాంత్ నీల్ ‘సలార్’ చిత్రాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, వైజయంతి మూవీస్ బ్యానర్ లో ‘ప్రాజెక్ట్ కె’ అనే చిత్రంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ చిత్రంగా ఇంట్రస్టింగ్  కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తుండగా.. క్రేజీ బ్యూటీ దీపికా పదుకొణే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంభందించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

నాగ్ అశ్విన్ వినాయక చవితి సందర్భంగా వేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. నాగ్ అశ్విన్ తన ప్రాజెక్ట్ కే సినిమాను ఎలా భావిస్తున్నాడో.. అది ఎంత గొప్పగా ఉండబోతోందో చెప్పకనే చెప్పేశాడు. వినాయక చవితి సందర్భంగా ప్రాజెక్ట్ కే స్క్రిప్ట్‌ను గణనాథుడి వద్ద పెట్టేశాడు నాగ్ అశ్విన్. ఇక ఆయన రాసిన కామెంట్స్ చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే.

Brilliant Film maker 's Instagram status 😍
Seeking Blessings from Lord Ganesha for the most Prestigious PAN INDIA Film with Rebel 🌟 ❤️✨ pic.twitter.com/SR8mlFzDIs

— Shreyas Media (@shreyasgroup)

ఒకప్పుడు వేద వ్యాసునికి మహా భారతాన్ని రాయడానికి సహాయం చేశారు.. ఇప్పుడు మా భారతానికి కూడా మీ ఆశీర్వాదం కావాలి.. విఘ్నేశ్వరా.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని నాగ్ అశ్విన్ అన్న ఇనిస్ట్రా పోస్ట్   తో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రాజెక్ట్ కేని మహాభారతంతో పోల్చడంతో ఆ రేంజ్ కథ ఉంటుందని అభిమానులు సంబరపడుతున్నారు. మరి కొందరు ...ఈ సినిమా  మహాభారతం ప్రేరణతో రూపొందుతోందని, అందులోని కర్ణుడు పాత్ర టైప్ లో ప్రభాస్ క్యారక్టర్ ఉండబోతోందని డిస్కషన్స్ చేస్తున్నారు. 

అలాగే టైమ్ ట్రావెల్ కథాంశంతో ఆసక్తికరమైన కథాకథనాలతో ‘ప్రాజెక్ట్ కె’ అభిమానుల్ని అలరించబోతోందని చెప్తున్నారు. మహాభారత కాలంలోకి వెళ్లి ప్రభాస్ వస్తాడని చెప్తున్నారు.  ‘మహానటి’ (Mahanati) చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న నాగ్ అశ్విన్.. ఈ సినిమా కోసం బోలెడంత రీసెర్చ్ చేశాడట. ఈ సినిమా కోసం లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasarao) ఇన్ పుట్స్ కూడా తీసుకున్నాడు. 

ఇదిలా ఉంటే  ‘ప్రాజెక్ట్ కె’ టైటిల్ లో ‘కె’ అంటే కల్కి అని అంటున్నారు.  ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేసేందుకు నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, దిశా పటానీ వంటి వారు నటిస్తోన్న సంగతి తెలిసిందే.
 

click me!