'వకీల్ సాబ్' టైటిల్ అద్భుతం.. అది అసాధ్యం, గత ఎన్నికల్లో పవన్ గ్రహించారు

By tirumala ANFirst Published May 27, 2020, 12:05 PM IST
Highlights

ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇటీవల విడుదలవుతున్న చిత్రాలపై, గతంలో విడుదలై విజయం సాధించిన, పరాజయ చెందిన చిత్రాలపై తన విశ్లేషణలు అందిస్తున్న సంగతి తెలిసిందే. పరుచూరి పలుకులు పేరుతో ఆయన తన అభిప్రాయాలు తెలుపుతున్నారు.

ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇటీవల విడుదలవుతున్న చిత్రాలపై, గతంలో విడుదలై విజయం సాధించిన, పరాజయ చెందిన చిత్రాలపై తన విశ్లేషణలు అందిస్తున్న సంగతి తెలిసిందే. పరుచూరి పలుకులు పేరుతో ఆయన తన అభిప్రాయాలు తెలుపుతున్నారు. తాజగా పరుచూరి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ టైటిల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

పరుచూరి మాట్లాడుతూ.. పవన్ దగ్గర ఓ అందం ఉంది. పవన్ నటించిన చిత్రాలకు ఎక్కువగా టైటిల్స్ హీరోని హైలైట్ చేసే విధంగా ఉండవు. జల్సా, అత్తారింటికి దారేది లాంటి టైటిల్స్ అలాంటివే. పవన్ ఎప్పుడూ టైటిల్స్ తనపైనే ఉండాలని కోరుకోలేదు. 

పవన్ లాయర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్ పెడతారని ఆసక్తిగా ఎదురుచూశా. వకీల్ సాబ్ అనేది అద్భుతమైన టైటిల్. ఈ టైటిల్ లాయర్లని గౌరవించే విధంగా ఉండడమే కాదు.. ముస్లిం ప్రేక్షకులని సైతం ఆకర్షించే విధంగా ఉంది. 

43 ఏళ్ల వయసులో మతిపోగోట్టే సోయగాలు.. అందుకే రంభ అంటే అంత పిచ్చి

లాయర్లు, రాజకీయ నాయకులు, పోలీసులకు సరిగ్గా పనిచేస్తే దేశం బాగుపడుతుంది. అలాంటి లాయర్లని గౌరవించే విధంగా టైటిల్ చివర్లో సాబ్ అని పేర్కొన్నారు. 

అదేవిధంగా పరుచూరి పవన్ రాజకీయ భవిష్యత్తుపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాత్రికల్లా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అసాధ్యం అని గత ఎన్నికల్లో పవన్ గ్రహించారు. నేను మీతోనే ఉంటాను అనే నమ్మకం ప్రజల్లో నెమ్మదిగా కలిగిస్తూ తన రాజకీయ పోరాటం కొనసాగిస్తున్నారని పరుచూరి అన్నారు. పవన్ పిలుపిస్తే చాలా ప్రభావం ఉంటుంది. అందుకే తన లక్షలాది మంది అభిమానులని రెచ్చగొట్టకుండా పవన్ బాధ్యతగా వ్యవహరిస్తున్నాడని పరుచూరి అన్నారు. 

click me!