షాకింగ్.. లారెన్స్ ట్రస్ట్ లో 20 మందికి కరోనా.. రంగంలోకి దిగిన అధికారులు

By tirumala ANFirst Published May 27, 2020, 9:20 AM IST
Highlights

క్రేజీ హీరో, కొరియోగ్రాఫర్, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్కు సామజిక స్పృహ ఎక్కువే. నిత్యం పేదవారికి సాయం చేయాలనే లారెన్స్ ఆలోచిస్తుంటారు. సందర్భం వచ్చిన ప్రతిసారి తానున్నాను అంటూ సాయం అందించేందుకు ముందుకు రావడం చూస్తూనే ఉన్నాం. 

ఇండియాలో కరోనా ప్రభావం ప్రారంభమైన సమయంలోనే లారెన్స్ విరాళం అందించాడు. కరోనా కట్టడికి లారెన్స్ 3 కోట్ల విరాళం అందించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా లారెన్స్ సొంతంగా చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాడు. ఈ ట్రస్ట్ ద్వారా ఎందరో నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్నారు. 

తాజాగా లారెన్స్ ట్రస్ట్ లో అందరికి షాక్ ఇచ్చే సంఘటన బయట పడింది. చెన్నైలోని అశోక్ నగర్ లో లారెన్స్ తన ట్రస్ట్ నడుపుతున్నారు. ఈ ట్రస్ట్ వసతి గృహంలో ఉంటున్నవారిలో 20 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ ఐంది. ట్రస్ట్ లో ఉంటున్నవారికి కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు పరీక్ష నిర్వహించారు. దీనితో 20ఎం మందికి కరోనా అని తేలింది. 

దీనితో అధికారులు లారెన్స్ ట్రస్ట్ ని తాత్కాలికంగా మూసివేసి అక్కడ ఉంటున్నవారందరినీ క్వారంటైన్ కు తరలించారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ సిబ్బంది లారెన్స్ ట్రస్ట్ మొత్తం క్రిమి సంహారక మందుని స్ప్రే చేశారు. 

click me!