మెహ్రీన్ పేరు చెబితేనే భయపడిపోతున్న నిర్మాతలు!

Published : Jan 18, 2020, 03:35 PM IST
మెహ్రీన్ పేరు చెబితేనే భయపడిపోతున్న నిర్మాతలు!

సారాంశం

హోటల్, లాండ్రీ బిల్లుల రూపంలో లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరోయిన్ కి సంబంధించిన ఖర్చులన్నీ నిర్మాతే భరించాలని ముందే అగ్రిమెంట్ రాసుకున్నారు. 

'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్. గతేడాది 'ఎఫ్ 2' సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ఈ బ్యూటీ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. తాజాగా ఈమె హీరోయిన్ గా నటించిన 'ఎంత మంచివాడవురా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఈ సినిమా విషయంలో నిర్మాతలను తెగ ఇబ్బంది పెట్టిందట మెహ్రీన్. ముఖ్యంగా హోటల్, లాండ్రీ బిల్లుల రూపంలో లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరోయిన్ కి సంబంధించిన ఖర్చులన్నీ నిర్మాతే భరించాలని ముందే అగ్రిమెంట్ రాసుకున్నారు.

వైరల్ ఫొటోలు : పిక్కలు కనపడేలా షార్ట్ లో జాన్వి, కుర్రాళ్లకు కిక్కే కిక్కు!

దాన్ని అలుసుగా తీసుకొని మెహ్రీన్ చెలరేగిపోయిందట. లంచ్ కి రూ.7 వేల చొప్పున నిర్మాతకు బిల్లు పంపిందట. షూటింగ్ మొత్తం పూర్తయ్యేసరికి లాండ్రీ ఖర్చుల రూపంలోనే లక్షలు వసూలు చేసిందని టాక్.

తనతో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా తనతోనే ఉంచుకొని, వారికి సంబంధించిన బిల్లుల్ని కూడా నిర్మాతతోనే కట్టించిందనీ.. ఈ విషయంలో మెహ్రీన్ కి నిర్మాతకి మధ్య చిన్న గొడవ కూడా జరిగిందని తెలుస్తోంది.

మెహ్రీన్ తిండి ఖర్చు విషయాలు ఇతర నిర్మాతల వరకు కూడా వెళ్లాయని సమాచారం. ఇకపై అగ్రిమెంట్లు చేసుకునేప్పుడు ఈ విషయంలో నిర్మాతలు షరతులు విధించినా.. ఆశ్చర్యపోనక్కర్లేదు!

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?