దిక్కుతోచని స్థితిలో బండ్ల గణేష్.. కేసీఆర్ కి దండం పెట్టాడు

By tirumala ANFirst Published Mar 27, 2020, 6:21 PM IST
Highlights

అసలు ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రలతో నటుడిగా తన కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ కమెడియన్ గా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆంజనేయులు చిత్రంతో బండ్ల గణేష్ ఊహించని విధంగా నిర్మాత అయ్యాడు.

అసలు ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రలతో నటుడిగా తన కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ కమెడియన్ గా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆంజనేయులు చిత్రంతో బండ్ల గణేష్ ఊహించని విధంగా నిర్మాత అయ్యాడు. ఆ తర్వాత గణేష్ గబ్బర్ సింగ్, టెంపర్, బాద్షా లాంటి సూపర్ హిట్స్ సొంతం చేసుకుని సీనియర్ నిర్మాతలని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కొంతకాలం బండ్ల గణేష్ హవా టాలీవుడ్ లో కొనసాగింది. 

కానీ ఇటీవల కొంతకాలంగా గణేష్ సైలెంట్ గా ఉన్నాడు. ఆ మధ్యన రాజకీయాలతో దెబ్బైపోయిన గణేష్ పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఇటీవల సరిలేరు నీకెవ్వరు చిత్రంతో నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చాడు. బండ్ల గణేష్ కు కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ వ్యాపారం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బండ్ల గణేషే. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా గణేష్ పౌల్ట్రీ బిజినెస్ పూర్తిగా దెబ్బతింది. 

పెళ్ళైన కొత్తలోనే అతడితో ఎఫైర్.. రూమర్స్ పై కరీనా హాట్ కామెంట్స్

చికెన్ కు, కరోనా కు సంబంధం లేకపోయినప్పటికీ చికెన్ జోలికి వెళ్లాలంటే జనాలు భయపడుతున్నారు. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ బిజినెస్ తీవ్రంగా ప్రభావానికి గురైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా కరోనాపై మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తూనే.. చికెన్, గుడ్లపై నెలకొన్న అపోహల్ని కూడా తొలగించే ప్రయత్నం చేశారు.

చాలా మంది చికెన్, గుడ్లు తింటే ప్రమాదమనే అపోహలో ఉన్నారు. అదంతా తప్పుడు ప్రచారం. వాస్తవానికి చికెన్, గుడ్లు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని కేసీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. 

మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ మీ సహాయానికి పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ బండ్ల గణేష్ 🙏 pic.twitter.com/961A0NUJAf

— BANDLA GANESH (@ganeshbandla)

చికెన్ పై ఉన్న అపోహల్ని కేసీఆర్ తొలగించే ప్రయత్నం చేయడం బండ్ల గణేష్ కు కాస్త ఊరటనిచ్చే అంశం. దీనితో బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపాడు. 'మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ మీ సహాయానికి శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ బండ్ల గణేష్ నమస్కారం' అంటూ బండ్ల గణేష్ దండం పెడుతున్న ఎమోజితో కేసీఆర్ ఫోటో షేర్ చేశాడు. 

click me!