ప్రభాస్ తో 'లూసీఫర్' లాంటి స్టైలిష్ ఫిల్మ్ ప్లానింగ్?

Published : Jul 26, 2023, 10:41 AM IST
ప్రభాస్  తో  'లూసీఫర్' లాంటి స్టైలిష్ ఫిల్మ్  ప్లానింగ్?

సారాంశం

మోహన్ లాల్ హీరోగా రూపొందిన లూసీఫర్ మూవీ తో దర్శకుడుగా తన కెరియర్ ను మొదలు పెట్టి  బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని  తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు.


ప్రభాస్ వంటి స్టార్ ని డైరక్ట్ చేయాలని ప్రతీ దర్శకుడుకీ ఉంటుంది. అయితే ఏ కొద్దిమందికో ఆ అవకాసం వస్తుంది. మామూలువాళ్లు ఆయన్ను రీచ్ కావటమే కష్టం.  అయితే దర్శకుడిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్న పృథ్వీరాజ్ తాజాగా ప్రభాస్ ని కలిసి ఓ కథను వినిపించారని మీడియావర్గాల కథనం. అది ఓ గ్యాంగస్టర్ కథ అని తెలుస్తోంది. స్టోరీ లైన్ విన్న ప్రభాస్...తను ప్రస్తుతం చేస్తున్న సినిమాలు,కమిట్మెంట్స్ ని బట్టి ప్లాన్ చేద్దాం అని చెప్పినట్లు సమాచారం. 

అయితే ఓ డిఫరెంట్ కథ అయితే బాగుండేది అన్నట్లు ప్రభాస్ అభిప్రాయ పడ్డారట. గ్యాంగస్టర్ స్టోరీ అంటే మళ్ళీ సలార్ ఛాయిలు రాకుండా చూడాలని అన్నారట. అలాగే ప్రభాస్ మాత్రం ఇప్పటి వరకు పృథ్వీరాజ్ చెప్పిన కథకు ఎస్ అని కానీ నో కని చెప్పలేదు అంటున్నారు. ఒక వేళ వీరి కాంబినేషన్ లో గ్యాంగ్ స్టార్ మూవీ కనుక ఓకే అయినట్టు అయితే ఆ సినిమాపై భారీ ఎక్సపెక్టేషన్స్  నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

పృధ్వీరాజ్.... ఆ మధ్యన మోహన్ లాల్ హీరోగా రూపొందిన లూసీఫర్ మూవీ తో దర్శకుడుగా తన కెరియర్ ను మొదలు పెట్టి  బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని  తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు.ఈ కథ కూడా లూసీఫర్ లా స్టైల్ తో నడిచే చిత్రం అంటున్నారు. కథలో వచ్చే ట్విస్్ట లు అదిరిపోయేలా డిజైన్ చేసారని, ప్యాన్ ఇండియా మూవి గా రెడీ చేసారని వినికిిడి. లూసీఫర్ చిత్రం తెలుగులో గాఢ్ ఫాధర్ గా రీమేక్ అయ్యిన సంగతి తెలిసిందే.

పృధ్వీరాజ్ ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ సలార్ లో ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ లో పృథ్వీరాజ్ పాత్ర అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.  పృథ్వీరాజ్ సుకుమారన్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపిస్తారట. అలానే యష్ కూడా తళుక్కున మెరుస్తాడట. యష్ గెస్ట్ రోల్ అనగానే.. మల్టీవర్స్ కాన్సెప్ట్ అనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ సినిమాలో ఇంతమంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ లు ఉండడంతో సినిమాపై మరింత బజ్ పెరిగిపోతుంది. 
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?