
పవర్ స్టార్ పవన్ కళ్యాన్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మెగా మూవీ బ్రో. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ తో పాటు హీరోయిన్ గా నటించింది హాట్ బ్యూటీ కేతికా శర్మ. ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ లో మెరిసింది. కాగా ఈ ఈవెంట్ లో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్. సినిమా అవకాశం గురించి.. తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి కూడా గుర్తు చేసుకున్నారు.
ఈ సినిమా కోసం పవన్ మామయ్య ఫోన్ చేసి.. ఈ క్యారెక్టర్ చేయాలి అని అన్నారు.. కాని నేను ఈ పాత్ర చేయడమా.. ఇది కలా నిజమా అని అనుకున్నాను. పవర్ స్టార్ ఫ్యాన్ గా చేయను అని చెప్పాను అన్నారు సాయి తేజ్. అయితే నువ్వు పక్కాగా చేయాలి అని పవర్ స్టార్ అన్నారు అని గుర్తు చేసుకున్నారు సాయి తేజ్. అంతే కాదు ఈసినిమా ఒకే అయిన తరువాత నాకు యాక్సిడెంట్ అయ్యింది. 12 రోజులు కోమాలో ఉన్నాను. ఆ టైమ్ లో కళ్యాణ్ మామయ్య రోజు వచ్చిన నా దగ్గర కూర్చుని చేయి పట్టుకుని ఏం అవ్వదు అన్న దైర్యం ఇచ్చేవారు..
ఆయన ఇచ్చిన ధైర్యంతోనే నేను కోలుకున్నాను. థ్యాంక్యూ వెరీమచ్ మామయ్య.. అంటూ పవర్ స్టార్ కు థ్యాంక్స్ చెప్పారు సాయి ధరమ్ తేజ్. ఇక ఈసినిమా ఫ్యాన్స్ అనుకున్నదానికంటే రెట్టింపు అద్భుతంగా ఉంటుంది అన్నారుసాయి తేజ్. సినిమా చూసి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని.. తొడకోట్టుకుంటూ.. గర్వంగా తిరుగుతుంటారు.. అని ఫ్యాన్స్ కు గ్యారంటీ ఇచ్చారుసాయి తేజ్. ఇక సినిమాలో అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ సముద్ర ఖనికి.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు.. టీమ్ అందరికి థ్యాంక్స్ చెప్పారు సాయి ధరమ్ తేజ్.
ఇంకా సాయి ధరమ్ తేజ్ థ్యాంక్స్ చెపుతుండగా... ఆడియన్స్ చప్పట్లు కొట్టారు. వెంటనే సాయి తేజ్ అందుకుని.. సరే సరే అర్ధం అయ్యింది. మీకంటే నేనే ముందు ఉంటాను పవర్ స్టార్ స్పీచ్ కోసం.. నన్ను థ్యాంక్స్ చెప్పుకోనివ్వండి అంటూ... అందరికి థ్యాంక్స్ చెప్పారు. మా ముగ్గురు మామయ్యల మాట మీద ఉంటానని.. వారి మాట మీరకుండా ఉంటాను అని చెప్పిన సాయి తేజ్.. ఈవెంట్ కు వచ్చిన వరుణ్ తేజ్, వైష్ణవ్ కు కూడా ధన్యవాదాలు తెలిపారు.