చిరంజీవి ఫస్ట్ మూవీ రైటర్ కన్నుమూత.. సింగపూర్ లో చిక్కుకుపోయిన కొడుకు

By tirumala ANFirst Published Apr 15, 2020, 9:22 AM IST
Highlights
మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు. కె వాసు దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి  చింతపెంట సత్యనారాయణ రావు(85) కథ, స్క్రీన్ ప్లే అందించారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు. కె వాసు దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి  చింతపెంట సత్యనారాయణ రావు(85) కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథలు అందించిన సత్యనారాయణ రావు మంగళవారం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. 

ఆయన గత కొంత కాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారని, అందువల్లనే మరణించినట్లు తెలుస్తోంది. సత్యనారాయణ రావు మృతి చెందడంతో.. కొంతమంది కుటుంబ సభ్యులు, బంధువులు కడసారి చూపుకు నోచుకోలేని పరిస్థితి నెలకొంది. కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

మరొక దయనీయ విషయం ఏంటంటే.. ఆయన పెద్ద కుమారుడు ప్రస్తుతం సింగపూర్ లో ఉన్నాడు. కరోనా ప్రభావంతో పెద్ద కుమారుడు ఇండియాకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు బంధువులు, శ్రేయోభిలాషులు ఎవ్వరూ పరామర్శకు రావద్దని, లాక్ డౌన్ నియమాలు గౌరవించాలని కుటుంబ సభ్యులు కోరారు. 

బుధవారం రోజే సత్యనారాణయ రావు అంత్యక్రియలు జరగనున్నాయి. సత్యనారాయణ రావు ప్రాణం ఖరీదు చిత్రంతో పాటు.. జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ఊరుమ్మడి బతుకులు, నాయకుడు వినాయకుడు, మల్లెమొగ్గలు, తరం మారింది లాంటి చిత్రాలకు కథలు అందించారు. 

రణబీర్, మహేష్, ప్రభాస్ రిజెక్ట్ చేసిన కథ అల్లు అర్జున్ చేతుల్లోకా..

ఎన్టీఆర్ చిత్రం సరదారాముడు, సొమ్మొకడిది సోకొకడిది లాంటి చిత్రాల్లో సత్యనారాయణ రావు నటించారు. సత్యనారాయణ రావు ఎన్నో నవలలు రచించారు, నాటక రంగంలో విశేషమైన సేవలు అందించారు. చాలా మంది నటీనటులకు నారాయణరావు శిక్షణ కూడా అందించారు. 
click me!