రణబీర్, మహేష్, ప్రభాస్ రిజెక్ట్ చేసిన కథ అల్లు అర్జున్ చేతుల్లోకా..

By tirumala ANFirst Published Apr 15, 2020, 8:26 AM IST
Highlights
వెండితెరపై మాస్ మసాలా ఫార్ములా చిత్రాలకు క్రమంగా ఆదరణ తగ్గుతోంది. అలాగని ప్రేక్షకులకు బోర్ కొట్టించేలా ప్రయోగాలు చేసిన కష్టమే. వైవిధ్యం ఉంటూనే, వినోదాన్ని కూడా జోడించాలి.. ప్రస్తుతం అలాంటి కథలకే ఆదరణ లభిస్తోంది.
వెండితెరపై మాస్ మసాలా ఫార్ములా చిత్రాలకు క్రమంగా ఆదరణ తగ్గుతోంది. అలాగని ప్రేక్షకులకు బోర్ కొట్టించేలా ప్రయోగాలు చేసిన కష్టమే. వైవిధ్యం ఉంటూనే, వినోదాన్ని కూడా జోడించాలి.. ప్రస్తుతం అలాంటి కథలకే ఆదరణ లభిస్తోంది. సందీప్ రెడ్డి వంగ బోల్డ్ కంటెంట్ తో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. 

హిందీలో కూడా అదే చిత్రాన్ని రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు సందీప్ కు మంచి డిమాండ్ ఉంది. మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలంతా సందీప్ చెప్పే కథ వినేందుకు ఆసక్తి చూపుతున్నారంటే అందుకు కారణం అర్జున్ రెడ్డి చిత్రంలో అతడి టేకింగ్. 

ఇదిలా ఉండగా అర్జున్ రెడ్డి తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో సందీప్ వంగ చిత్రం ఉంటుందని ప్రచారం జరిగింది. సందీప్ మహేష్ కు స్టోరీ నెరేట్ చేశాడు కూడా. మహేష్ బాబు కూడా కథ ఎగ్జైట్ అయ్యాడు. కానీ సందీప్ చెప్పిన కథ వైవిధ్యంతో కూడుకున్నది. ప్రస్తుతం ఎలాంటి రిస్క్ తీసుకునే ఉద్దేశంలో లేని మహేష్ సందీప్ కథని పక్కన పెట్టినట్లు టాక్. 

ఇదే కథని సందీప్ బాలీవుడ్ రొమాంటిక్ కింగ్ రణబీర్ కు చెప్పాడట. ప్రయోగాలకు రణబీర్ ఎప్పుడూ రెడీ. కానీ కొన్ని కారణాల వల్ల రణబీర్ ఈ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పడం కుదర్లేదు. ఆ తర్వాత ఇదే కథ ప్రభాస్ వద్దకు వెళ్ళింది. ప్రభాస్ కూడా ఇంట్రస్ట్ చూపాడు. కానీ చివరకు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శత్వంలో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ఇది భారీ చిత్రం.. ఇది పూర్తవడానికి కొన్నేళ్లు పడుతుంది. 


అప్పటి వరకు సందీప్ వేచి ఉండడం కష్టమే. దీనితో సందీప్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని సంప్రదించినట్లు టాక్. ప్రస్తుతం బన్నీ పాన్ ఇండియా క్రేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. సందీప్ చెప్పిన కథ కూడా పాన్ ఇండియా మూవీనే. పైగా సందీప్ కు కబీర్ సింగ్ చిత్రం ద్వారా బాలీవుడ్ లో అనుభవం ఉంది. దీనితో సందీప్ అల్లు అర్జున్ నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు. మరి సందీప్ కథకు బన్నీ ఒకే చెబుతాడో లేదో చూడాలి. ఈ చిత్రానికి సందీప్ 'ఫ్యాక్టరీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 
click me!