ప్రభాస్ పాత్ర..ఓ పులిహార వార్త?

By tirumala ANFirst Published Feb 26, 2020, 10:13 PM IST
Highlights

ఓ పెద్ద సినిమా ప్రారంభమవుతోందంటే...ఆ సినిమా గురించి సినీ ప్రేమికులు, ఆ హీరో అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తూంటారు.

ఓ పెద్ద సినిమా ప్రారంభమవుతోందంటే...ఆ సినిమా గురించి సినీ ప్రేమికులు, ఆ హీరో అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తూంటారు. ఆ నేపధ్యంలో సినిమా గురించి రకరకాల విశేషాలు సేకరించటానికి, కుదరకపోతే సొంతంగా అయినా వండి వడ్డించటానికి మీడియా సిద్దంగా ఉంటుంది.  అయితే అలాంటి గాసిప్స్ వల్ల కాసేపు ఆనందం మినహా..నష్టమేమీ ఉండదు కాబట్టి అందరూ లైట్ తీసుకుంటారు. తాజాగా ఈ రోజు ప్రభాస్,మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమా ఎనౌన్సమెంట్ వచ్చింది. ఇక ఊరుకుంటారా...పులిహార వార్తలు మొదలైపోయాయి.

ఈ సినిమాని 200 కోట్ల బడ్జెట్ తో మొదలెడుతున్నారని, అలాగే ఈ సినిమా ఓ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టు అనీ, ఈ సినిమాలో ప్రభాస్ ఓ సూపర్ హీరోగా కనపడనున్నారని. ఇలా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే కొంత నిజం ఉండచ్చు. కానీ అంతా నిజమని మాత్రం చెప్పలేం. ప్రభాస్ ..సూపర్ హీరోగా కనపడితే ఆనందమే. అదీ ఇండియన్ సూపర్ హీరో పాత్ర ...అంటే ఎలా డిజైన్ చేసారో తెలిస్తే కానీ అంచనాలు పెట్టుకోలేం. ఇక ఈ సినిమాకు మాత్రం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయబోతున్నారట.అశ్వనీదత్ ఈ సినిమాని నెవ్వర్ బిఫోర్..నెవ్వర్ ఆఫ్టర్ తరహాలో ప్లాన్ చేస్తున్నాడట.
 
‘మహానటి’తో జాతీయ అవార్డును దక్కించుకున్న నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ తన 21వ చిత్రం చేయబోతున్నాడు. వైజయంతి మూవీస్‌ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను వైజయంతి మూవీస్‌ అధినేత అశ్వినీదత్‌ నిర్మించనున్నారు.

‘వైజయంతి మూవీస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ప్రభాస్‌ చిత్రాన్ని తెరకెక్కించనున్నామని చెప్పడానికి గర్విస్తున్నాం’అంటూ ఆ సంస్థ ట్వీట్‌ చేసింది.  అయితే ఈ సినిమా టైటిల్‌, కథ, తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.  

click me!