మీ వల్లే ఓడిపోయా.. అభిమానులపై పవన్ ఆగ్రహం

Published : Dec 09, 2019, 12:07 PM IST
మీ వల్లే ఓడిపోయా.. అభిమానులపై పవన్ ఆగ్రహం

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేని విధంగా తన అభిమానులపై అసహనం వ్యక్తం చేశారు. మీ కారణంగా గత ఎలక్షన్స్ లో ఓడిపోయాను అని పవన్ చెప్పడం అందరిని షాక్ కి గురి చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేని విధంగా తన అభిమానులపై అసహనం వ్యక్తం చేశారు. మీ కారణంగా గత ఎలక్షన్స్ లో ఓడిపోయాను అని పవన్ చెప్పడం అందరిని షాక్ కి గురి చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పర్యటనలో పవన్ రైతుల కష్టాల గురించి తెలుసుకుంటున్నారు.

 అయితే రీసెంట్ గా ఒక సభ నిర్వహించిన జనసేనాని ఉహించని విధంగా ఆగ్రహానికి గురయ్యారు. రోజు అధికార పక్షంపై విరుచుకుపడే పవన్ కళ్యాణ్ తన వద్దకు వచ్చిన అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో పవన్ మాట్లాడుతున్నప్పుడు అభిమానులు కొంతమంది ఈలలు, కేకలు వేస్తుండడంతో సహనం కోల్పోయిన పవన్ అసహనానికి గురయ్యారు. అందరికి క్రమశిక్షణ చాలా అవసరం.  క్రమశిక్షణ లేకపోవడం వల్లనే గత ఎన్నికల్లో జనసేన ఓటమి చెందిందని మీ వల్ల ఇబ్బంది కలుగుతోందని పవన్ మండిపడ్డారు.

పవన్ అలా మాట్లాడటంతో అందరు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. క్రమశిక్షణ లేకపోతే ఏమి సాధించలేమని చెప్పిన పవన్ ఆవేదనకు సభలో చాలా మంది మద్దతు పలికారు. ఇక పవన్ కి సంబందించిన రీ ఎంట్రీ సినిమాపై గత కొన్ని నెలలుగా అనేక రకాల వస్తున్న విషయం తెలిసిందే. పింక్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ సినిమాను సెట్స్ పైకి ఎప్పుడు తీసుకెళతాడా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?