'అల వైకుంఠపురములో' టీజర్.. కిక్కిచ్చే డైలాగ్స్

Published : Dec 09, 2019, 11:14 AM ISTUpdated : Dec 09, 2019, 04:19 PM IST
'అల వైకుంఠపురములో' టీజర్.. కిక్కిచ్చే డైలాగ్స్

సారాంశం

అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం "అల.. వైకుంఠపురములో.." గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాపై అంచనాల డోస్ గట్టిగా పెరుగుతోంది. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం "అల.. వైకుంఠపురములో.." గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాపై అంచనాల డోస్ గట్టిగా పెరుగుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన బజ్ చూస్తుంటే సంక్రాంతికి మెగా అల్లుడు ఓపెనింగ్స్ తో రికార్డులు సృష్టించేలా ఉన్నాడు.

ఇకపోతే నేడు సినిమాకు సంబందించిన ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చారు. సినిమాకు సంబందించిన టీజర్ విడుదలపై గతకొంత కొన్నిరోజులుగా అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా నేడు రిలీజ్ డేట్ పై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. అల వైకుంఠపురములో టీజర్ ఈ నెల 11న రిలీజ్ కాబోతోందట. ఇక నేడు సాయంత్రం చిత్ర యూనిట్ ఒక స్పెషల్ గ్లిమ్ప్స్ తో ఆడియెన్స్ కి కిక్కివ్వనుంది.

మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగాన్ని అందుకుంటున్నాయి. సీనియా సాంగ్స్ మంచి హైప్ క్రియేట్ చేయడంతో సినిమా టీజర్ కూడా మరింత బజ్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ ద్వారా తెలిసింది. ఒక స్పెషల్ డైలాగ్ సినిమాలో క్రేజీగా ఉండబోతోందట. అలాగే థమన్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నట్లు సమాచారం. మరి ఫైనల్ గా సినిమా టీజర్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?