
సూపర్ స్టార్ కొత్త చిత్రం ‘జైలర్’ఈ రోజు రిలీజై మార్నింగ్ షోకే షేకైపోయే టాక్ తెచ్చుకుంది. అసలు ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ నాటి నుంచే అనూహ్యమైన క్రేజ్ కనిపిస్తోంది. ఆ క్రేజ్ ని మాగ్జిమం మ్యాచ్ చేస్తూ సినిమా సాగింది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఉండటం ఆయన అభిమానులను ఆనందపరుస్తోంది. ఎక్కడ వస్తుంది ఆ రిఫెరన్స్ అంటే..
జైలర్ సినిమా సెకండ్ హాఫ్ లో కథ ప్రకారం సునీల్, తమన్నా ట్రాక్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇద్దరు సినిమాలో కూడా నటులు గానే కనిపిస్తారు. ఈ ఇద్దరినీ పెట్టి సినిమా తీసే డైరక్టర్ గా ఒక కమిడియన్ కనిపిస్తాడు. ఈ క్యారెక్టర్ విగ్ తో పెద్ద జుట్టుతో కనపడితే..ఇతన్ని ఉద్దేశించి సునీల్ “ ఆ ...పెద్ద పవన్ కళ్యాణ్ జుట్టు మరి నీది ” అంటూ అతన్ని వెటకారం చేస్తూ ఒక డైలాగ్ చెప్తాడు. ఇది తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో పెట్టింది మాత్రమే కాదు తమిళ వెర్షన్ లో కూడా ఉండడం చెప్పుకోదగ్గ విషయం. పవన్ కళ్యాణ్ పేరు వినిపించగానే థియేటర్ లో విజిల్స్ మోతమోగటం విశేషం.
ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే...రెండు తెలుగు రాష్ట్రాల్లో రజినీ ఒకప్పటి క్రేజ్‌ను గుర్తు చేస్తూ ‘జైలర్’కు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా నడుస్తున్నాయి. చాలా షోలు ఫుల్ అయిపోతున్నాయి. మిగతావి ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్నాయి. ఇక తమిళ వెర్షన్‌కు క్రేజ్ అయితే మామూలుగా లేదు. తమిళనాట ఈ సినిమాకు తొలి రోజు ఎక్కడా టికెట్ ముక్క మిగిలేలా కనిపించడం లేదు. ‘జైలర్’ తమిళ వెర్షన్‌కు హైదరాబాద్‌లో సైతం పెద్ద ఎత్తున షోలు ఇచ్చారు. వాటికి రెస్పాన్స్ బాగుంది.