
మెహర్ రమేష్ ముందుర పెద్ద టార్గెట్టే ఉంది. ఆయన తాజా చిత్రం భోళా శంకర్ హిట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందకంటే చిరంజీవి నమ్మి వేదాళం రీమేక్ కు ఆయనకు అప్పచెప్పారు. ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. వెయిటింగ్ మోడ్ అన్నట్లుగా సోషల్ మీడియా ఎదురుచూస్తోంది. అయితే ఈ లోగా అజిత్ ఫ్యాన్స్ కు దొరికేసాడు. వాళ్లు ఆడేసుకోవటం మొదలెట్టారు.
మీడియాతో ప్రెస్ మీట్ పెట్టి భోళా దర్శకుడు మెహర్ రమేష్ అన్న మాటలు ఇప్పుడు అజిత్ ఫ్యాన్స్ ని రగిలేలా చేసాయి. రీమేకుల ప్రస్తావన వచ్చినప్పుడు వేదాళంలో పదింతలు ఎక్కువ క్రింజ్ ఉంటుందని, అదంతా తాను తీయలేదని, అవసరమైన మార్పులు చేర్పులు చేసి నా స్టైల్ లో చిరంజీవిని ప్రెజెంట్ చేశానని చెప్పుకొచ్చాడు.
దాంతో మా సినిమానే క్రింజ్ అంటావాని అజిత్ అభిమానులు మెల్లగా మెహర్ గత చిత్రాలు షాడో, శక్తి తాలూకు వీడియోలు బయటికి తీసి ఇదేంటో చెబుతావా అంటూ కౌంటర్లు వేస్తున్నారు. మాములుగానే తమిళ హీరో అభిమానులకు ప్రాంతీయాభిమానం, హీరోల మీద ఆరాధనాభావం ఎక్కువ. దాంతో ఈ స్టేట్ మెంట్ చూసి మండిపడుతున్నారు. భోళా శంకర్ బ్లాక్ బస్టర్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. లేకపోతే అజిత్ ఫ్యాన్స్ దాడి మామూలుగా ఉండదు.
ఏదైమైనా నమ్మి రీమేక్ చేస్తున్నప్పుడు ఒరిజనల్ మూవీని తక్కువ చేయడం ఎందుకు అనేది అజిత్ ఫ్యాన్స్ అభిప్రాయం. వేదాళం రిలీజయినపుడు తమిళనాడుని వరదలు ముంచెత్తుతున్నాయి. అయినా సరే మొదటి వారంలోనే వంద కోట్ల గ్రాస్ సాధించింది. ఆ ఏడాది టాప్ లో నిలబడింది.