ఆత్మహత్య చేసుకున్న బ్రహ్మాజీకి జనసేన అండ.. పవన్ విరాళం

Published : Oct 28, 2019, 01:42 PM IST
ఆత్మహత్య చేసుకున్న బ్రహ్మాజీకి జనసేన అండ.. పవన్ విరాళం

సారాంశం

పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. రీసెంట్ గా ఆత్మహత్య చేసుకున్న తాపీమేస్త్రి కుటుంబానికి అండగా నిలిచారు. తనవంతు సహాయంగా లక్ష రూపాయల విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. రీసెంట్ గా ఆత్మహత్య చేసుకున్న తాపీమేస్త్రి కుటుంబానికి అండగా నిలిచారు. తనవంతు సహాయంగా లక్ష రూపాయల విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

గుంటూరు, తెనాలి మండలం సంగం జాగర్లమూడిలో చింతం నాగ బ్రహ్మజీ (35) అనే తాపీమేస్త్రీ గత 5 నెలలుగా పనులు లేక, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు పనిలేకపోవడం చిన్నపిల్లల్ని వదిలేసి భార్య కూలీకి వెళ్లడంతో మనస్తాపం చెందిన బ్రహ్మాజీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.  దీంతో ఒక్కసారిగా ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. సూసైడ్ చేసుకున్న నాగ బ్రహ్మాజీకి నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను.

అతని మరణం నన్ను తీవ్ర బాధను కలిగించింది. ఆంధ్రప్రదేశ్ లో భావన నిర్మాణాల కార్మికుల దుస్థితికి బ్రహ్మాజీ ఆత్మహత్య నిదర్శనం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఇసుక అస్థవస్థ డీలింగ్స్ కారణంగా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు.  దాదాపు 19.6లక్షల మంది నేరుగా అలాగే 10 లక్షలకు పైగా కార్మికులు పరోక్షంగా ఉపాధి కోల్పోతున్నారు. దాదాపు 30 లక్షల మంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారిని వెంటనే ఆదుకోవాలని వారు దుర్భర జీవనాన్ని గడుపుతున్నారని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు.

read more కార్మికుల ఆత్మహత్యలపై చంద్రబాబు ఆవేదన... ప్రభుత్వంపై సీరియస్

ఈ ఆత్మహత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్మికుడు ఆత్మహత్య తర్వాత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ సెల్ఫీ వీడియో బయటకు రావడంతో పోలీసులు  కూడా చర్యలు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

ఇదే జిల్లాలో గతంలో ఇదే సమస్యకు ఓ తాపీమేస్త్రీని బలయ్యాడు. గుంటూరు, తెనాలి మండలం సంగం జాగర్లమూడిలో చింతం నాగ బ్రహ్మజీ (35) అనే తాపీమేస్త్రీ గత 5 నెలలుగా పనులు లేక, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. దీంతో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు పనిలేకపోవడం చిన్నపిల్లల్ని వదిలేసి భార్య కూలీకి వెళ్లడంతో మనస్తాపం చెందిన బ్రహ్మాజీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 

read more video news : తాపీమేస్త్రీని బలితీసుకున్న ఇసుక కొరత

ఇలా ఇసుక కొరతతో ఉపాది కోల్పోయి ఇప్పటికే ఇద్దరు కార్మికులు బలవన్మరణానికి పాల్పడగా తాజాగా మరో ఘటన జోటుచేసుకుంది. ఈ ఆత్మహత్యలపై మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుఇదివరకే స్పందించారు.ఈ ఆత్మహత్యలకు వైఎస్సార్‌సిపి ప్రభుత్వమే కారణమంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికన విరుచుకుపడ్డారు. 

''జీవితం ఎంతో విలువైనది, పోరాడి సాధించాలే తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఇంకెవరూ తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంది. నేను ఉన్నాను. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాడుదాం. ఇసుక అక్రమాలపై నిలదీద్దాం.'' అంటూ కార్మికులకు ఆయన ధైర్యాన్ని నూరిపోశారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?