చరిత్ర అంచున ప్రతి పేజీలో ఇలాంటి రాబిన్ హుడ్స్ చాలా మంది ఉన్నారు. కాలగర్భంలో కనుమరుగైన వారెందరో ఉన్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. తెలుగు వాళ్లకి తెలియని ఒక తెలంగాణ రాబిన్ హుడ్ కథను పవన్ కళ్యాణ్ తెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
రాబిన్ హుడ్ అంటే చాలు ఎలాంటి వారైనా ఇష్టపడతారు. చట్టాలకు అలాంటి వారు శత్రువులే అయినా సాధరణ జనాలకి సహాయపడే హీరోల్లో కనిపిస్తుంటారు. చరిత్ర అంచున ప్రతి పేజీలో ఇలాంటి రాబిన్ హుడ్స్ చాలా మంది ఉన్నారు. కాలగర్భంలో కనుమరుగైన వారెందరో ఉన్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. తెలుగు వాళ్లకి తెలియని ఒక తెలంగాణ రాబిన్ హుడ్ కథను పవన్ కళ్యాణ్ తెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
''ఉన్నోళ్ళని కొట్టిండు. లేనోళ్లకి పెట్టిండు. పండుగల సాయన్న వాడురాజులకు మొనగాడు"
undefined
సాయన్నకు చరిత్ర అందించిన ఈ ఒక్క లైన్ ఇంకా మహబూబ్ నగర్ జిల్లాలో వినిపిస్తూనే ఉంటుంది. ఇక గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ ఇలాంటి హిస్టారికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు క్రిష్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ 27వ దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తెలంగాణకు చెందిన 'పండుగల సాయన్న' అనే ఒక యోధుడి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాబిన్ హుడ్ అని పిలవబడే ఈ యోధుడి కథపై ఇప్పటికే ఇంటర్నెట్ లో సెర్చ్ లు మొదలయ్యాయి.
పెదవాళ్ళ ఆకలి కడుపులను పసిగట్టి రాజుల నుంచి దోచుకున్న ఆహారాన్ని వారికి పంచేవాడట. ఉన్నవాళ్ళ నుంచి దోచుకున్న సంపదను లేనోళ్లకి పంచేవారట. కొన్ని కోటలపై యుద్దాలు కూడా చేశాడని తెలుస్తోంది. చరిత్రలో అతని కథ ఎక్కడా కనిపించకుండా కనుమరుగవుతున్న తరుణంలో పవన్ మళ్ళీ తన సినిమాతో దేశమంతా తెలిసేలా చేస్తున్నాడు. ఆ సినిమా కోసం చిత్ర యూనిట్ వర్క్ షాప్ మొదలు పెట్టింది. పవన్ కళ్యాణ్ లుక్ పై కూడా టెస్టులు చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గడ్డం లేకుండా ఉండటం కూడా ఆ సినిమా కోసమేనని సమాచారం. మరీ ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.