RRRలో హాట్ బ్యూటీ.. నిజమైతే బ్యాడ్ లక్ బద్దలైనట్లే?

Published : Feb 07, 2020, 12:08 PM IST
RRRలో హాట్ బ్యూటీ.. నిజమైతే బ్యాడ్ లక్ బద్దలైనట్లే?

సారాంశం

బిగ్ బడ్జెట్ మూవీ RRR కోసం ఆడియెన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా అనుకున్న సమయానికి వస్తుందని చిత్ర యూనిట్ చెప్పిన మాటలన్నీ గాలిలో కలిసిపోయాయి.  

ఇండియన్ బిగ్ బడ్జెట్ మూవీ RRR కోసం ఆడియెన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా అనుకున్న సమయానికి వస్తుందని చిత్ర యూనిట్ చెప్పిన మాటలన్నీ గాలిలో కలిసిపోయాయి.  నెక్స్ట్ ఇయర్ జనవరిలో సినిమా వస్తుందని చెబుతున్నప్పటికీ ఆడియెన్స్ లో నమ్మకం కలగడం లేదు.

ఇకపోతే సినిమాకు సంబందించిన అప్డేట్స్ మెగా నందమూరి అభిమానులను కూల్ చేయాలనీ  చిత్ర యూనిట్ ప్రణాళికలు రచిస్తోంది. సినిమాకు సంబందించిన మరొక గాసిప్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో హాట్ బ్యూటీ హంసనందిని కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

ప్రస్తుతం ఈ బ్యూటికి ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లేవు. కేవలం ఐటెమ్ సాంగ్స్ తో కాలాన్ని నెట్టుకొస్తోంది. అయితే సోషల్ మీడియాలో హంసకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె పోస్ట్ చేసే హాట్ ఫోటోలు నిమిషాల్లో వైరల్ అవుతుంటాయి. ఇక ఆఫర్స్ లేవనుకుంటున్న సమయంలో RRRలో కనిపించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇది నిజమైతే బేబీ బ్యాడ్ లక్ బద్దలైనట్లే అని చెప్పవచ్చు. మరీ ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరీకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?