పాక్ సినిమాలో ఐటెం సాంగ్.. మండిపడుతున్న నెటిజన్లు!

By AN TeluguFirst Published Oct 31, 2019, 1:53 PM IST
Highlights

ఈ సినిమాలో నీలం మునీర్ అనే యువతి ఐటెం సాంగ్ లో నటించింది. మేరే ఖ్వాబోంమే అంటూ సాంగే ఈ పాట భారత్ ని ద్వేషిస్తూ సాగుతుంది. అయితే ఈ పాటను అసభ్యంగా చిత్రీకరించడంతో నెటిజన్ల నుండి విమర్శలు వచ్చాయి. 

పాకిస్తాన్ లో 'కాఫ్ కంగనా' పేరుతో ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం నిర్మించిన సినిమాలో ఐటెం సాంగ్ వివాదాస్పదంగా మారింది. ఆ పాటపై పాక్ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పూర్తి వివరాలలోకి వెళితే.. పాక్ మిలిటరీ పీఆర్ విభాగం నిర్మించిన సినిమా 'కాఫ్ కంగనా'. ఈ సినిమాలో నీలం మునీర్ అనే యువతి ఐటెం సాంగ్ లో  నటించింది.

మేరే ఖ్వాబోంమే అంటూ సాంగే ఈ పాట భారత్ ని ద్వేషిస్తూ సాగుతుంది. అయితే ఈ పాటను అసభ్యంగా చిత్రీకరించడంతో నెటిజన్ల నుండి విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఐఎస్‌పీఆర్‌ డీజీ ఆసిఫ్‌ గపూర్‌ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఐటెం సాంగ్ లో నటించిన నీలం మునీర్ భారత్ కి చెందిన యువతి పాత్రను పోషించిందని.. పాక్ కి చెందిన యువతి పాత్ర కాదని సమర్ధించుకున్నారు.

దర్శకుడు వియన్ ఆదిత్య కొత్త చిత్రం ప్రకటన!

సినిమాలో పాట ఏ సందర్భంలో వస్తుందనేది సినిమా చూస్తే అర్ధమవుతుందని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమా కశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు రూపొందించిందనీ, పాట చిత్రీకరణ ఐఎస్‌పీఆర్‌ ప్రధాన కార్యాలయంలో కానీ, ఇస్లామాబాద్ లో కానీ చిత్రీకరించలేదని వివరించారు.

ఈ విషయంపై స్పందించిన నటి నీలం మునీర్.. తన జీవితంలో ఇది మొదటి ఐటెం సాంగ్ అలానే చివరిది అని చెప్పింది.  ఐఎస్‌పీఆర్‌ నిర్మించినందునే ఐటెం సాంగ్ లో 
నటించానని.. దేశం కోసం ఇలా చేయడం తనను తప్పనిపించలేదని అన్నారు. అయినప్పటికీ పాక్ నెటిజన్లు ఊరుకోలేదు.

ఐఎస్‌పీఆర్‌ డీజీ ఆసిఫ్‌ గపూర్‌, నీలంలను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కశ్మీర్, దేశ రక్షణ పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు. కంగనా అనే హిందూ యువతీ, అలీ ముస్తఫా అనే పాకిస్తాన్ ముస్లిం యువకుడి మధ్య నడిచే ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.   
 

click me!