బన్నీ ఓవర్ కాన్ఫిడెన్స్.. మహేష్ కంటే ముందుగానే..?

Published : Dec 31, 2019, 02:24 PM ISTUpdated : Dec 31, 2019, 02:27 PM IST
బన్నీ ఓవర్ కాన్ఫిడెన్స్.. మహేష్ కంటే ముందుగానే..?

సారాంశం

మొదట రెండు సినిమాలు ఒకే డేట్ న రాబోతున్నట్లు అనౌన్స్ చేయడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చివరికి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మధ్యవర్తిత్వంతో పరిస్థితి చక్కబడింది. జనవరి 11న 'సరిలేరు నీకెవ్వరు', 12న 'అల.. వైకుంఠపురములో' సినిమాలు వచ్చేలా సెటిల్మెంట్ చేసుకున్నారు. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అల.. వైకుంఠపురములో', మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలు సంక్రాంతి రేసులో నిలబడానికి సిద్ధమయ్యాయి. మొదట రెండు సినిమాలు ఒకే డేట్ న రాబోతున్నట్లు అనౌన్స్ చేయడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

చివరికి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మధ్యవర్తిత్వంతో పరిస్థితి చక్కబడింది. జనవరి 11న 'సరిలేరు నీకెవ్వరు', 12న 'అల.. వైకుంఠపురములో' సినిమాలు వచ్చేలా సెటిల్మెంట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు వ్యవహారం మరింత ముదురుతున్నట్లు తెలుస్తోంది.

అందమైన బుట్టబొమ్మలు... ఎంతెంత బరువులు మోసారు!

తాజాగా సినిమా ఫస్ట్ కాపీ చూసుకున్న బన్నీ అండ్ టీమ్ కాన్ఫిడెన్స్ తో సినిమాని జనవరి 10న రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా నిర్మాత సంస్థ హారికా హాసిని ప్రమేయం లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సినిమా తొలిరోజు రికార్డ్ రావాలంటే 'సరిలేరు' కంటే ముందుగా సినిమాను విడుదల చేయాలని బన్నీ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం.

అయితే ఇలా చేస్తే తమ యూనిట్ కి మాట వస్తుందని, నిర్మాత చినబాబుకి ఉన్న మంచి పేరు పాడవుతుందని హారికా హాసిని యూనిట్ ఆలోచిస్తుంది. ఒకరోజు ఆలస్యంగా విడుదలైనా.. థియేటర్ల సమస్య లేదని, ఎక్కువ థియేటర్లు తమకే ఉంటాయని భావిస్తుంది. కానీ బన్నీ టీమ్ మాత్రం ఇలా ఆలోచించడం లేదు.

ప్రీమియర్లు, తొలిరోజు వసూళ్లు తమకే ఎక్కువ ఉండాలని చూస్తోంది. దీంతో ఇప్పుడు మల్లగుల్లాలు మొదలయ్యాయి. చివరికి హారికా హాసిని దిగొచ్చి కావాలంటే జనవరి 11నే తమ సినిమా కూడా రిలీజ్ చేద్దామని ఒకరోజు ముందుగా వద్దని బన్నీ అండ్ టీమ్ ని కన్విన్స్ చేస్తోందట. ఈ విషయంలో  సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?