బికినీలో సింగర్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

Published : Dec 31, 2019, 01:02 PM ISTUpdated : Dec 31, 2019, 01:06 PM IST
బికినీలో సింగర్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

సారాంశం

తాజాగా సోనా బికినీ ఫోటోలు వేసుకొని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమెని ఏకి పారేశారు. సోషల్ మీడియాలో ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 

బాలీవుడ్ సంగీత దర్శకుడు అను మాలిక్ తనను లైంగికంగా వేధించాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సింగర్ సోనా మొహపాత్ర. ఈ విషయంలో కొందరు ఆమెకి సపోర్ట్ చేయగా.. మరికొందరు మాత్రం ఆమెని తిట్టిపోశారు. అను మాలిక్ అటువంటి వ్యక్తి కాదని సోనా మొహపాత్ర కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తుందని ఆమెపై మండిపడ్డారు.

ఇది ఇలా ఉండగా.. తాజాగా సోనా బికినీ ఫోటోలు వేసుకొని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమెని ఏకి పారేశారు. సోషల్ మీడియాలో ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మగాళ్లని రెచ్చగొట్టడం కోసమే ఇలా ఒళ్లంతా విప్పి చూపిస్తూ.. వాళ్లు ఏదైనా అంటూ మళ్లీ మీటూ అంటారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అందమైన బుట్టబొమ్మలు... ఎంతెంత బరువులు మోసారు!

ఈ కామెంట్స్ పై స్పందించిన సోనా.. తన ఫోటోలు చూసి చాలా మంది చెత్త కామెంట్స్ చేశారని అన్నారు. విప్పి చూపించి ఆ తరువాత మీటూ అని ఏడుస్తానని కొందరు అంటున్నారని.. మరికొందరు తనలాంటి సీరియ వ్యక్తులు ఇలాంటి పోస్ట్ లు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారని.. ఇంకొందరు తన ఫోటోలకు లైక్ కొడుతున్నారని.. కానీ వీటిలో దేంతో తను ఏకీభవించనని చెప్పింది.

ఇక ఈ ఫోటోలు సోనా మొహాపాత్రకి బాలీవుడ్ హెయిర్ స్టైలిస్ట్ సప్నా భవ్నానీకి మధ్య వివాదాన్ని రేపాయి. సప్నా సోషల్ మీడియాలో సోనాని ఉద్దేశిస్తూ పరోక్షంగా కామెంట్స్ చేసింది. ఇలాంటి చెత్త బట్టలు వేసుకొని ఫెమినిజం అంటారంటూ మండిపడింది. దీంతో సోనా మరింత రెచ్చిపోయి సోషల్ మీడియాలో వార్ కి దిగింది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. 


 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?