నిర్మాత నట్టికుమార్ కి జైలు శిక్ష!

Published : Mar 07, 2020, 11:47 AM IST
నిర్మాత నట్టికుమార్ కి జైలు శిక్ష!

సారాంశం

వివరాల్లోకి వెళితే.. 2009లో 'శంఖం' సినిమా ప్రదర్శించడానికి డిస్ట్రిబ్యూటర్‌ గా ఉన్న నట్టి కుమార్ విజయనగరంలోని రాజ్యలక్ష్మి థియేటర్ యజమాని రవికుమార్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. 

చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ నట్టి కుమార్ కి ఏడాది జైలు, రూ.50 వేలు జరిమానా విధిస్తూ విజయనగరం రెండో అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దీపదైవకృప శుక్రవారం నాడు తీర్పు చెప్పారు.

వివరాల్లోకి వెళితే.. 2009లో 'శంఖం' సినిమా ప్రదర్శించడానికి డిస్ట్రిబ్యూటర్‌ గా ఉన్న నట్టి కుమార్ విజయనగరంలోని రాజ్యలక్ష్మి థియేటర్ యజమాని రవికుమార్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికోసం రూ.6 లక్షల 50 వేలు చెల్లించేందుకు ఒప్పుకున్నారు.

కానీ అనుకున్న రోజుల కంటే ముందుగానే సినిమా ప్రదర్శన నిలిపివేసి మరో థియేటర్ కి అప్పగించారు. రవికుమార్ కి రూ.5 లక్షల 50 వేలకు సంబంధించి చెక్కు ఇచ్చారు. కానీ.. చెక్ ని బ్యాంక్ లో వేయగా బౌన్స్ అయింది.

ఆ తరువాత చాలా సార్లు నట్టి కుమార్ ని సంప్రదించినా.. ఫలితం లేకపోవడంతో రవికుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి తీర్పు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?