సీనియర్ నటుడు జనార్ధన్ రావు కన్నుమూత!

Published : Mar 07, 2020, 09:10 AM IST
సీనియర్ నటుడు జనార్ధన్ రావు కన్నుమూత!

సారాంశం

అభిలాష, అమ్మోరు, జానకిరాముడు, పెదరాయుడు.. ఇలా పలు సినిమాల్లో ఈయన కీలక పాత్రల్లో నటించారు. గోకులంలో సీత, తలంబ్రాలు వంటి సీరియల్స్ లోనూ నటించారు. 

సీనియర్ నటుడు జనార్ధన్ రావు చెన్నైలో శుక్రవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. గుంటూరు జిల్లా పొనిగ‌ళ్ల గ్రామంలో జన్మించిన జనార్ధన్ రావు వెయ్యికి పైగా తెలుగు సినిమాలు, పలు సీరియల్స్ లో నటించారు.

అభిలాష, అమ్మోరు, జానకిరాముడు, పెదరాయుడు.. ఇలా పలు సినిమాల్లో ఈయన కీలక పాత్రల్లో నటించారు. గోకులంలో సీత, తలంబ్రాలు వంటి సీరియల్స్ లోనూ నటించారు. ఈయన చివరిగా నటించిన చిత్రం జనతాగ్యారేజ్.

సౌత్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ, కమిటీ సభ్యుడిగా పనిచేశారు. జనార్ధన్ రావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?