చరణ్ ముందు, తారక్ వెనుక.. మొదలైన RRR ఫ్యాన్స్ వార్

By Prashanth MFirst Published 26, Mar 2020, 8:33 AM
Highlights

ఈ రోజుల్లో మల్టీస్టారర్ సినిమా అనేది దర్శకులకు చాలా కష్టమైన పని. ఇద్దరు హీరోలను సమానంగా చూపిస్తూ అభిమానులను నొప్పించకుండా సినిమా చేయాలి. చిన్న తేడా వచ్చినా స్టార్స్ కంటే అభిమానులే ఎక్కువగా ఫీల్ అవుతారు. ఇక RRR విషయంలో అనుకున్నదే జరుగుతోంది. ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 

మల్టీస్టారర్ సినిమాలు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎన్టీఆర్ , ఏఎన్నార్ వంటి సీనియర్ హీరోలు అప్పట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మల్టీస్టారర్ సినిమా అనేది దర్శకులకు చాలా కష్టమైన పని. ఇద్దరు హీరోలను సమానంగా చూపిస్తూ అభిమానులను నొప్పించకుండా సినిమా చేయాలి. చిన్న తేడా వచ్చినా స్టార్స్ కంటే అభిమానులే ఎక్కువగా ఫీల్ అవుతారు.

ఇక RRR విషయంలో అనుకున్నదే జరుగుతోంది. ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే టైటిల్ లుక్ ని అలా రిలీజ్ చేశారో లేదో ఓ వర్గం అభిమానుల్లో ఈర్షలు మొదలయ్యాయి. మా హీరో వెనక, వారి హీరో ముందా? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో వార్ కొనసాగిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ నీరుతో ఎంట్రీ ఇవ్వడం, చరణ్ నిప్పుతో ఎంట్రీ ఇవ్వడం కూడా కొత్త వివాదానికి దారి తీస్తోంది. నిప్పు, నీరు అంటూ సెటైర్లు వేయడం స్టార్ట్ చేస్తున్నారు.

రాజమౌళి ఆలోచనతో టాలీవుడ్ లో కూడా కూడా బిగ్ స్టార్స్ మల్టీస్టారర్ ల హవా మొదలైంది అని అనుకుంటున్న తరుణంలో కొంత మంది అభిమానులు ఇలా వ్యవహరిస్తుండటం కొంత ఆందోళన చెందే విషయం. పైగా సినిమా రిలీజ్ కాకముందే ఈ రేంజ్ లో గోడవపడుతున్నారు అంటే రిలీజ్ అనంతరం ఫ్యాన్స్ ఫైట్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అని మరికొంతమంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా రాజమౌళి మాత్రం RRR పోస్టర్ ని అంచనాలకు తగ్గట్టుగానే క్రియేట్ చేశాడు. 'రౌద్రం రణం రూధిరం' టైటిల్ ఆడియెన్స్ కి బాగా నచ్చేసింది. ఇక కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బౌమ్ప్స్ తెప్పించింది. వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 26, Mar 2020, 8:33 AM