కరోనా ఎఫెక్ట్.. సాయం చేసేందుకు సిద్ధమైన స్టార్ హీరోస్

By Prashanth MFirst Published 26, Mar 2020, 7:54 AM
Highlights

కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎవరు ఊహించని విధంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశమంతా ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోతోంది. ముందుజాగ్రత్తగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారి ప్రజలను కాపాడుకునేందుకు ఎలాంటి కష్టం రాకుండా ప్రణాళికలు రచిస్తున్నాయి. 

కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎవరు ఊహించని విధంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశమంతా ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోతోంది. ముందుజాగ్రత్తగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారి ప్రజలను కాపాడుకునేందుకు ఎలాంటి కష్టం రాకుండా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇకపోతే ప్రభుత్వాలకు సహాయపడేందుకు కొంతమంది సినీతారలు విరాళాలు అందిస్తున్నారు.

ఇటీవల టాలీవుడ్ లో నితిన్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు  10లక్షల విరాళాన్ని అందించిన విషయం తెలిసిందే. అయితే తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా సినీ ప్రముఖులు ఈ కష్టకాలంలో సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) కి దర్శకుడు శంకర్ , కమల్ హసన్ పది లక్షల చెక్కును అందజేశారు. ఇక అదే తరహాలో టాలెంటెడ్ హీరో ధనుష్ కూడా  తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వర్కర్స్ కి తనవంతు సాయంగా వారి నిత్యావసరల కోసం 15 లక్షలు అందజేశారు. 

లాక్ డౌన్ తో దేశంలో చాలా మంది ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఎవరు కుడా ఆకలితో ఇబ్బంది పడకూడదని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని అందించేందుకి సిద్ధమయ్యింది. దేశంలో అన్ని చోట్లా హై అలెర్ట్ ప్రకటించారు. ఇక బుధవారం తెలంగాణలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అయినప్పటికీ అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికి వైద్య బృందం పరీక్షలు నిర్వహిస్తోంది.

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 26, Mar 2020, 7:54 AM